Amazon offers: :అమెజాన్ దివాలీ సేల్‌.. 60 శాతం డిస్కౌంట్‌

By Rekulapally Saichand  |  First Published Oct 20, 2019, 11:36 AM IST

అమెరికా ఈ-కామర్స్ రిటైల్ సంస్థ అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట మరోసారి వినియోగదారుల ముంగిట్లోకి వచ్చింది. ఈ నెల  21-25 మధ్య అమలులో ఉండే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60 శాతం దాకా డిస్కౌంట్‌ లభిస్తుంది. టాప్‌ బ్రాండ్స్‌, లేటెస్ట్‌ ఉత్పత్తులపై కూడా టాప్‌ డీల్స్‌ లభ్యం అవుతాయి.


బెంగళూరు: అమెరికా రిటైల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా దీపావళి స్పెషల్ సేల్‌ శనివారం ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ అర్థరాత్రి నుంచి 25వ తేదీవరకు  ఈ స్పెషల్‌ సేల్‌ నిర్వహించనున్నది.

Latest Videos

ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే తన ప్రైమ్ సభ్యుల కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 12 గంటల నుంచే  ప్రత్యేకమైన సేల్‌, స్పెషల్‌ అఫర్లను కూడా అమెజాన్‌ ప్రకటించింది. 

ఆపిల్, షియోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60శాతం దాకా డిస్కౌంట్‌ లభ్యమవుతున్నాయి. అక్టోబర్ నెలలో అమెజాన్ తన వినియోగదారులకు అందిస్తున్న మూడో గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ ఇది. 

వన్‌ప్లస్ 7టీ, శాంసంగ్ ఎం30ఎస్, వివో యు10తోపాటు పలు సంస్థల స్మార్ట్ ఫోన్లను అమెజాన్ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు నోకాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 

డెబిట్, క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్‌సర్వ్‌ కార్డులు, అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత రివార్డ్ పాయింట్లతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.  యాక్సిస్ బ్యాంక్, సిటీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు, అన్ని రూపే కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. 

ఎల్‌జీ (43) 4 కె స్మార్ట్ టీవీ వర్ల్‌పూల్‌ కన్వర్టిబుల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, శామ్‌సంగ్‌ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లతోపాటు కొత్తగా ప్రారంభించిన సాన్యో కైజెన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంటి లేటెస్ట్‌ ఉత్పత్తులపైనా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్‌ తెలిపింది.

హెచ్పీ, కెనాన్, బోట్, లెనొవో వంటి టాప్ బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. హెచ్పీ ఐ5 1 టీబీ హెచ్డీ డీ లాప్ టాప్ రూ.42,990, సోనీ 5 100 ఎల్ కెమెరా రూ.27,990, శామ్ సంగ్ గెలాక్సీ యాక్టివ్ వాచ్ రూ.17,990లకు అందిస్తోంది. 

click me!