ఏఐతో వారానికి 3 రోజుల పని విధానం సాధ్యమే.. మనుషులు అంతగా కష్టపడొద్దు : బిల్‌గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 23, 2023, 5:06 PM IST

కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి బిల్‌గేట్స్ చేసిన  వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘‘వాట్ నౌ’’ కార్యక్రమంలో పాల్గొన్న బిల్‌గేట్స్‌ను రాబోయే రోజుల్లో కృత్రిమ మేథ గురించి మానవాళీ ఎదుర్కొనబోయే ముప్పు గురించి ట్రెవర్ ప్రశ్నించారు.


మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్‌గేట్స్ తన వ్యాపార వ్యవహారాలతో పాటు సమకాలీన అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటూ వుంటారు. మేధావిగా గుర్తింపు పొందిన ఆయన చెప్పే మాటలకు అంతర్జాతీయంగా విలువ వుంటుంది. తాజాగా కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి బిల్‌గేట్స్ చేసిన  వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘‘వాట్ నౌ’’ కార్యక్రమంలో పాల్గొన్న బిల్‌గేట్స్‌ను రాబోయే రోజుల్లో కృత్రిమ మేథ గురించి మానవాళీ ఎదుర్కొనబోయే ముప్పు గురించి ట్రెవర్ ప్రశ్నించారు. పాడ్‌‌కాస్ట్, యంత్రాలు రోజువారీ పనుల భారాన్ని మోయడం వల్ల మనుషులు ఏ మాత్రం కష్టపడని ప్రపంచం వుంటుందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. 

గేట్స్ తన జీవితంలో రెండు దశాబ్ధాలకు పైగా అంటే 18 నుంచి 40 ఏళ్ల వరకు మైక్రోసాఫ్ట్‌ను నిర్మించడంలో ‘‘మోనో-మానికల్’’గా వ్యవహరించినట్లు చెప్పాడు. ఇప్పుడు 68 ఏళ్ల వయసులో .. ‘‘జీవిత లక్ష్యం ఉద్యోగాలు చేయడమే కాదు’’ అని గ్రహించాడు. వారానికి మూడు రోజులే పనిచేసే సమాజం వచ్చినా సరే మన లక్ష్యం అది కాదని బిల్‌గేట్స్ తేల్చిచెప్పారు. యంత్రాలు ఆహారాన్ని, వస్తువులను తయారు చేయగలవని, తద్వారా మనం కష్టపడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

Latest Videos

undefined

బిల్‌గేట్స్ గతంలో తన మునుపటి ఇంటర్వ్యూలు, బ్లాగ్‌ పోస్ట్‌లలో ఏఐ వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలను ఎన్నోసార్లు హైలెట్ చేశారు. ‘‘గేట్స్ నోట్స్’’ ఈ ఏడాది జూలైలో షేర్ చేసిన పోస్టులో ఏఐ వల్ల తలెత్తే ప్రమాదాలను ఆయన ప్రస్తావించారు. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, సెక్యూరిటీ వార్నింగ్స్‌, జాబ్ మార్కెట్‌లో మార్పులు, విద్యపై ఏఐ ప్రభావం చూపుతుందని బిల్‌గేట్స్ చెప్పారు.

లేబర్ మార్కెట్‌లో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మార్పు సహజమేనని , ఇదేమి మొదటిసారి కాదని ఆయన గుర్తుచేశారు. కానీ ఏఐ ప్రభావం.. పారిశ్రామిక విప్లవం మాదిరిగా నాటకీయంగా వుంటుందని తాను అనుకోవడం లేదని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. ఇది ఖచ్చితంగా కంప్యూటర్‌ ఆవిర్భవించిన దాని కంటే పెద్దగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. 

తనకు తెలిసినంత వరకు ఏఐ భవిష్యత్తు కొంతమంది అనుకున్నంత భయంకరంగా, ఇతరులు అనుకున్నంత రోజీగానూ వుండదన్నారు. ఆ ప్రమాదాలు నిజమని.. కానీ వాటిని మనిషి మేనేజ్ చేయగలడని నేను ఆకాంక్షిస్తున్నానని గేట్స్ నోట్‌లో రాసుకొచ్చారు. 

click me!