రిలయన్స్‌ రిటైల్‌లో అమెరికా సంస్థ సిల్వర్‌ లేక్‌ పెట్టుబడులు..!

By Sandra Ashok KumarFirst Published Sep 5, 2020, 11:28 AM IST
Highlights

 రిలయన్స్ రిటైల్ విలువ 57 బిలియన్ డాలర్లు ఇందులో 10 శాతం షేర్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక నివేదికలో తెలిపింది. సిల్వర్ లేక్ దీనిపై స్పందించడానికి నిరాకరించింది.

అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిటైల్ విభాగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుపుతున్నట్లు నివేదించింది.

రిలయన్స్ రిటైల్ విలువ 57 బిలియన్ డాలర్లు ఇందులో 10 శాతం షేర్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక నివేదికలో తెలిపింది.

సిల్వర్ లేక్ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. భారతదేశపు ధనవంతుడు ముఖేష్ అంబానీ యజమాన్యంలోని ఆయిల్-టు-టెలికాంల సమ్మేళనం రిలయన్స్, దేశంలో తన రిటైల్ వ్యాపారాన్ని బలీయమైన శక్తిగా మారుస్తోంది అలాగే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వేగంగా విస్తరిస్తోంది.

also read  రోజుకి 9 గంటలు నిద్రపోతూ 1 లక్ష సంపాదించొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

రిలయన్స్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ డిజిటల్ వ్యాపారంలో వాటాను విక్రయించడం ద్వారా ఫేస్‌బుక్ ఇంక్‌తో సహా ప్రపంచ పెట్టుబడిదారుల నుండి 20 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.

రాబోయే త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ లో పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు చివరలో రిలయన్స్ భారతదేశ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను 3.38 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

 కాగా రిలయన్స్‌ జియోలో సిల్వర్‌ లేక్‌ సంస్థ రెండు దఫాలుగా 2.08 శాతం వాటా కోసం రూ.10,203 కోట్ల పెట్టుబడులు పెట్టింది. జియోలో ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలకు రిలయన్స్‌ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆఫర్‌ లభించిందని, దీనిపై ఆ సంస్థలు కసరత్తు చేస్తున్నాయని సమాచారం.
 

click me!