ఎంటీఆర్‌ ఫుడ్స్‌ చేతికి ఈస్టర్న్‌ మసాలా బ్రాండ్‌.. త్వరలో రెండు కంపెనీల విలీనం..

By Sandra Ashok KumarFirst Published Sep 5, 2020, 11:05 AM IST
Highlights

ఓర్క్లల ఫుడ్స్ ఎం‌టి‌ఆర్ ద్వారా ఈస్టర్న్ లో 41.8% వాటాను, ఈస్టర్న్ లోని మెక్‌కార్మిక్ ఇంగ్రెడీఎంట్స్ ఎస్‌ఈ ఆసియాలో 26% వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని, దీనితో ఓర్క్లలకు మొత్తం 67.8% వాటాను పొందుతుంది అని తేలిపింది. 

కొచ్చికి  చెందిన ఈస్టర్న్ కండిమెంట్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నార్వే కన్జూమర్ ప్రధాన సంస్థ ఓర్క్లల యాజమాన్యంలోని ఎమ్‌టిఆర్ ఫుడ్స్ శుక్రవారం తెలిపింది.

ఓర్క్లల ఫుడ్స్ ఎం‌టి‌ఆర్ ద్వారా ఈస్టర్న్ లో 41.8% వాటాను, ఈస్టర్న్ లోని మెక్‌కార్మిక్ ఇంగ్రెడీఎంట్స్ ఎస్‌ఈ ఆసియాలో 26% వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని, దీనితో ఓర్క్లలకు మొత్తం 67.8% వాటాను పొందుతుంది అని తేలిపింది.

ఈస్టర్న్ లో ప్రస్తుతం మీరన్ ఫ్యామిలి (74%), మెక్‌కార్మిక్ (26%) వాటా ఉంది. ఈ వాటా కొనుగోలు రూ.2వేల కోట్లు అని దీనిని సంస్థలు అంగీకరించాయని ఓర్క్లల ఒక ప్రకటనలో తెలిపింది.

also read 

30 జూన్ 2020తో ముగిసిన 12నెలల్లో ఎం‌టి‌ఆర్ 920 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నివేదించింది. లావాదేవీలు పూర్తయిన తరువాత ఈస్టర్న్ ను  ఎం‌టి‌ఆర్ లో విలీనం అవుతుంది.

ఎమ్‌టిఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ శర్మ మాట్లాడుతూ భారతీయ బ్రాండెడ్ ఫుడ్ అండ్ స్పైస్ మార్కెట్లు రెండంకెలలో పెరుగుతున్నాయని, ఆ సంస్థ పెరుగుతున్న కొనుగోలు శక్తి, పట్టణ జీవనశైలితో దీర్ఘకాలిక డిమాండ్ ఉందని అన్నారు.

ఈస్టర్న్ మాంసాహార, శాఖాహార ఆహార ఉత్పత్తుల కోసం మసాలా దినుసులను విక్రయిస్తుంది. మరోవైపు, ఎం‌టి‌ఆర్ పూర్తిగా శాఖాహారం ప్యాకేజీ చేసిన ఆహారాన్ని విక్రయిస్తుంది. "ఎం‌టి‌ఆర్ తో ఓర్క్లలలో భాగంగా మా కార్యకలాపాలకు బలమైన వేదికగా ఉంటుంది" అని ఈస్టర్న్ చైర్మన్ నవాస్ మీరన్ అన్నారు.
 

click me!