
ఇప్పటి వరకు ఆదానీ పవర్ ఒక్కో ఈక్విటీ షేర్ విలువ రూ. 10గా ఉంది. ఇప్పుడు దీనిని ఒక్కో షేర్‌ను రూ. 2 విలువ కలిగిన 5 షేర్లుగా విభజిస్తారు. ఇది కంపెనీ చరిత్రలో తొలి స్టాక్ స్ప్లిట్. ఇప్పటి వరకు కంపెనీ బోనస్ షేర్లు లేదా స్టాక్ స్ప్లిట్స్ చేయలేదు. దీంతో షేర్‌ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న మొత్తం ఈక్విటీ షేర్లు: 2,480 కోట్లు. స్టాక్ స్ప్లిట్ తర్వాత ఇవి 12,400 కోట్లకు పెరుగుతాయి. రికార్డ్ డేట్ (ఎవరికి కొత్తగా విభజించిన షేర్లు వస్తాయో నిర్ణయించే తేదీ)ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
ఈ నిర్ణయం కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగింది. స్క్రూటినైజర్ రిపోర్ట్ ప్రకారం, అధిక శాతం షేర్‌హోల్డర్లు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారు. ఆదానీ పవర్ షేర్ ధర ట్రెండ్ గమనిస్తే.. గత ఏడాది కాలంలో షేర్ ధరపై ఒత్తిడి కనిపించింది.
* 52 వారాల గరిష్టం: రూ. 681.30 (సెప్టెంబర్ 16, 2024)
* 52 వారాల కనిష్ఠం: ₹430.85 (నవంబర్ 21, 2024)
* గత ఒక సంవత్సరం కాలంలో షేర్ 6% తగ్గింది.
* కానీ, 2025లో ఇప్పటివరకు షేర్ ధర 15% పెరిగింది. ఇది సెన్సెక్స్ (2% పెరుగుదల) కంటే మెరుగ్గా ఉంది.
గత ముగింపు ధర: రూ.608.50గా ఉండగా ప్రారంభ ధర: రూ.609.90, ఇంట్రాడే కనిష్ఠం: రూ.601.80గా ఉంది. సెప్టెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 12:05కి ధర రూ.603.10 (0.90% తగ్గుదల)గా నమోదైంది.