Budget2024: మాల్దీవులకు షాక్?.. ‘టూరిస్టులకు ఆకర్షించడానికి లక్షదీవులకు పెట్టుబడులు పెంచుతాం’

By Mahesh KFirst Published Feb 1, 2024, 12:16 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం మాల్దీవులకు పరోక్షంగా షాక్ ఇచ్చింది. టూరిస్టులను ఆకర్షించడానికి టూరిస్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. లక్షదీవులకు పెట్టుబడులు భారీగా పెంచుతామని వివరించారు.
 

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2024 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ రోజు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో లక్షదీవులను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయమూ ఒకటి ఉన్నది. మాల్దీవులతో దౌత్యపరమైన వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లక్షదీవులను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. లక్షదీవుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. తద్వార పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు.

లక్షదీవుల్లో టూరిస్టులను ఆకర్షించడానికి పర్యాటక మౌలిక సదుపాయాలపై ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. టూరిజం సెక్టార్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతుందనీ వివరించారు. ఇందులో ముఖ్యంగా లక్షదీవులపై ప్రధానంగా ఫోకస్ పెడుతామని చెప్పారు.

Latest Videos

Also Read: Budget2024: మనం ప్రపంచానికి దారి చూపాం.. మిడిల్ ఈస్ట్ కారిడార్ చరిత్రలో నిలుస్తుంది: నిర్మల సీతారామన్

ఇటీవల లక్షదీవులు కేంద్రంగా మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షదీవులు పర్యటించినప్పుడు.. మాల్దీవ్స్‌కు చెందిన అప్పటి మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. లక్షదీవులను చిన్నచూపుతో మాట్లాడారు. తమ మాల్దీవ్స్ ఎంతో మెరుగు అన్నట్టుగా కామెంట్ చేశారు. ఇది ఉభయ దేశాల మధ్య వివాదానికి దారి తీసింది. భారతీయులు చాలా మంది మాల్దీవులపై విరుచుకుపడ్డారు. మాల్దీవులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. మాల్దీవులకు పర్యటించవద్దని చాలా మంది నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీంతో మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పడిపోయింది.  ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం లక్ష దీవులపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

click me!