ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన ప్రజ్ఞానంద ఎవరు?

By SumaBala BukkaFirst Published Feb 1, 2024, 12:03 PM IST
Highlights

2018లో, ప్రజ్ఞానంద 12 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్, ప్రపంచంలో రెండవ-పిన్నవయస్కుడయిన గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. 

ఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రజ్ఞానంద పేరును ప్రస్తావించారు. భారత్ ఇలాంటి 80మంది గ్రాండ్ మాస్టర్లను తయారుచేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకు ఈ ప్రజ్ఞానంద ఎవరు? ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించేంత ప్రత్యేకత ఏమిటి? అంటే...

రమేష్‌బాబు ప్రజ్ఞానంద భారత చెస్ గ్రాండ్ మాస్టర్. విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారతదేశపు నెం.1 చెస్ ఆటగాడిగా నిలిచాడు. 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు ఈ18 ఏళ్ల చెస్ ప్రాడిజీ రమేష్‌బాబు ప్రజ్ఞానంద. అలా భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రజ్ఞానంద తన 5 సంవత్సరాల వయస్సు నుంచే చెస్ ఆడటం ప్రారంభించాడు. ప్రపంచ గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన తరువాత ఫలితంపై సంతోషం వ్యక్తం చేశాడు. "క్లాసికల్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌పై మొదటిసారి గెలవడం చాలా బాగుంది" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించడానికున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆ సమయంలో క్లాసికల్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌తో తొలిసారి ఆడడం.. గెలవడం మీద తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

Interim Budget 2024 : నీలంరంగు కాంతా చీరలో మెరిసిపోతున్న ఆర్థికమంత్రి...

2018లో, ప్రజ్ఞానంద 12 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్, ప్రపంచంలో రెండవ-పిన్నవయస్కుడయిన గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు.  గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన ఐదవ-పిన్నవయస్సు వ్యక్తిగా రికార్డ్ నమోదు చేసుకున్నారు. ప్రజ్ఞానంద అసాధారణ నైపుణ్యాలు, విజయాలకు ప్రసిద్ధి.

ప్రజ్ఞానంద అక్క,ఆర్ వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్. ఆమె భారతదేశంలో గ్రాండ్‌మాస్టర్‌గా మారిన మూడవ మహిళా చెస్ క్రీడాకారిణిగా రికార్డ్ సాధించారు. వీరిద్దరూ ప్రపంచంలోనే మొట్టమొదటి సోదర, సోదరీ గ్రాండ్ మాస్టర్ జంటగా చరిత్ర సృష్టించారు. 

ప్రజ్ఞానంద తమిళనాడులోని చెన్నైలో 10 ఆగస్టు 2005న జన్మించారు. ప్రజ్ఞానంద తండ్రి, రమేష్‌బాబు, టీఎన్ఎస్సీ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగలక్ష్మి గృహిణి. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ప్రజ్ఞానందతో పాటు కనిపిస్తుంటారు. ప్రజ్ఞానంద చెన్నైలోని వేలమ్మాళ్ మెయిన్ క్యాంపస్‌కు హాజరయ్యాడు.

ప్రజ్ఞానంద 2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ అండర్-8 టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో ఎఫ్ఐడీఈ మాస్టర్ బిరుదు అందుకున్నాడు. 2015లో అండర్-10 టైటిల్‌ను గెలుచుకున్నాడు.

2016లో, ప్రజ్ఞానానంద 10 సంవత్సరాల, 10 నెలల 19 రోజుల వయస్సులో చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచాడు. 

10 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ మాస్టర్ అయ్యాడు, ఆ సమయంలో అతి పిన్న వయస్కుడిగా, 12 సంవత్సరాల వయస్సులో గ్రాండ్ మాస్టర్ మారాడు. ఇంత ట్రాక్ రికార్డ్ తో దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేవారు కాబట్టే... నిర్మలా సీతారామన్ ప్రజ్ఞానంద గురించి ప్రస్తావించారు.
 

click me!