కేంద్ర బడ్జెట్ 2024 లో.. ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది ఇదే..!

By ramya Sridhar  |  First Published Jul 23, 2024, 11:56 AM IST

 నిర్మలమ్మ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత కేటాయించారు.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
 


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ఎంత కేటాయిస్తారు అనే ఆసక్తి ముందు నుంచి ఉంది. ఎందుకంటే.. రీసెంట్ గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుగా ఎన్నికల్లో తలపడ్డాయి. ఈ పొత్తు కారణంగానే కూటమి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విజయఢంకా మోగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని టీడీపీ.. కేంద్రంలోని బీజేపీ పొత్తులో ఉండటం వల్ల.. రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉందని అందరూ నమ్మారు. బడ్జెట్ విషయంలోనూ.. ఏపీకి కేటాయింపులు బాగా జరుగుతాయని భావించారు. మరి..  నిర్మలమ్మ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత కేటాయించారు.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని నిర్మలాసీతారామన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు ప్రత్యేక సాయం చేస్తామని ఆమె ప్రకటించారు. అవసరాన్ని బట్టి.. అమరావతికి మరిన్ని నిధులు కూడా అందజేస్తామని ఆమె చెప్పారు.

Latest Videos

undefined

అంతేకాకుండా.. పోలవరానికి పెద్ద పీట వేస్తామని అన్నారు. తొందరగా.. దానిని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇక రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ  కింద స్పెషల్ గా నిధులు అందజేస్తామని కూడా చెప్పారు. విశాఖ- చెన్నై కారిడార్ లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. 

మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులకు.. ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందుతుందా లేదా అనేది చూడాలి. 

click me!