Union Budget 2024 Key Highlights: బడ్జెట్‌ 2024 హైలైట్స్‌ ఇవే.. ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు

By Galam Venkata Rao  |  First Published Jul 23, 2024, 11:21 AM IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం బడ్జెట్‌ 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో వరుసగా ఏడోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.


కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం బడ్జెట్‌ 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో వరుసగా ఏడోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మధ్యంతర బడ్జెట్‌లో 4 అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఉద్యోగం, స్కిల్, ఎంఎస్‌ఎంఈ... ఇలా తొమ్మిది రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. 

హైలైట్స్ ఇవే...

  • బడ్జెట్‌లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం 
  • వ్యవసాయ పరిశోధన రంగానికి అత్యంత ప్రాధాన్యం 
  • పంట ఉత్పత్తులను పెంచేలా పరిశోధలనకు ప్రోత్సాహం
  • రానున్న ఐదేళ్లలో కోటి మంది రైతులు నేచురల్‌ ఫామింగ్‌ వైపు ప్రోత్సహించాలని లక్ష్యం
  • బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయింపు
  • ప్రకృతి వ్యవసాయం చేసే ఔత్సాహిక రైతులకు శిక్షణ, సర్టిఫికేషన్‌
  • 109 కొత్త వంగడాలను రైతులకు అందించాలని నిర్ణయం
  • యువతకు భారీగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా బడ్జెట్‌లో ప్రణాళికలు
  • రానున్న ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం
  • 20 లక్షల మంది యువతకు ఐదేళ్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ
  • 1000 ట్రైనింగ్‌ సెంటర్స్‌ అప్‌గ్రెడేషన్‌
  • మోడల్‌ స్కిల్‌ లోన్ స్కీమ్‌ పునరుద్ధరణ
  • కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రతి ఒక్కరికీ EPFO పథకం అమలు
  • విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు

Latest Videos

 

  • ఆంధ్రప్రదేశ్‌కు వరాలు...:
  • కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్రాధాన్యం
  • అమరావతి కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు
  • ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయింపు
  • ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలుకు చర్యలు
  • ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
  • రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం ప్రాంతాలకు నిధులు
  • సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయం
  • విశాఖ- చెన్నై, బెంగళూరు-ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రోత్సాహం

 

  • పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్, జార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల అభివృద్ధి
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
  • మహిళలు, బాలికల అభివృద్ధికి రూ.3లక్షల కోట్లు కేటాయింపు
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రత్యేక ప్రోత్సాహం
  • క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్స్
  • సెల్ఫ్ గ్యారెంటీ ఫండ్ కింద ఎంఎస్ఎంఈలకు రూ.100 కోట్లు కేటాయింపు
  • ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల పెంపు

విద్యార్థులకు ప్రోత్సాహం...

  • ఇకపై విద్యార్థులకు రూ.10లక్షల రుణం ఇవ్వాలని నిర్ణయం

  •  500 పరిశ్రమల్లో 1 కోటికి మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం

  • దేశ వ్యాప్తంగా కొత్తగా 12 పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
  • ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల నివాసానికి డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం
  • పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. జనాభా 30 లక్షలు పైబడిన 14 నగరాల్లో చర్యలు
  • పట్టణ ప్రాంతాల్లో రానున్న ఐదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు
  • వరదలతో నష్టపోయిన బిహార్‌కు రూ.11వేల కోట్లు ఆర్థిక సాయం
  • వరదల కారణంగా నష్టపోయిన అస్సాంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం
  • మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట.. రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
  • మౌలిక సదుపాయాల కల్పనలకు జీడీపీలో 3.4 శాతం కేటాయింపు

పన్నులు.. మార్పులు

  • జీఎస్టీ విధానం పన్నుల చెల్లింపును సులభతరం చెేసింది: నిర్మలా సీతారామన్
  • మరింత సులభతరంగా జీఎస్టీని మారుస్తాం: నిర్మలా సీతారామన్
  • మరింత సరళతరంగా FDI విధానం
  • కేన్సర్ వైద్యంలో వినియోగించే మెడిసిన్, మెడికల్ ఎక్విప్‌మెంట్ కి కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
  • 3 రకాల కేన్స్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
  • 20 రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • మొబైల్స్, మొబైల్ పరికరాలపై  బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
  • రొయ్యలు, చేపల ఫీడ్‌పై BCD 5 శాతానికి తగ్గింపు
  • బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గింపు

 

పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్...

  • స్టాండర్డ్ డిడక్షన్: ఉద్యోగులు- రూ.50 వేల నుంచి 75 వేలకు పెంపు; పింఛనుదారులు- రూ.15 వేల నుంచి 25 వేలకు పెంపు
  • రూ.4కోట్ల మంది వేతనదారులు, పింఛనదారులకు సాంత్వన

టాక్స్ శ్లాబ్స్...

  • రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారికి పన్ను 0 శాతం
  • రూ.3లక్షల నుంచి రూ.7 లక్షలు - 5శాతం
  • రూ.7లక్షల నుంచి రూ.10లక్షలు - 10 శాతం  
  • రూ.10 లక్షల నుంచి రూ.12లక్షలు - 15 శాతం
  • రూ.12లక్షల నుంచి రూ.15లక్షలు - 20 శాతం
  • రూ.15లక్షలు నుంచి ఆపైన - 30 శాతం 

 

click me!