ఈసారి నిర్మలా సీతారామన్ తెలుపు రంగు చీరలో మెరిశారు. తెలుపు రంగు చీరకు మెజెంటా రంగు అంచు కలిగి ఉంది. కాగా.. ఈసారి మాత్రమే కాదు.. ఆమె ప్రతి సంవత్సరం బడ్జెట్ రోజున ధరించే విషయంలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటూ ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. వరసగా ఏడోసారి.. కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టడం విశేషం. ఆర్థిక శాఖ మంత్రిగా.. ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి ఆమె ఓ రికార్డును కూడా క్రియేట్ చేయడం విశేషం. బడ్జెట్ సంగితి పక్కన పెడితే... ప్రతిసారీ.. బడ్జెట్ ని ప్రవేశ పెట్టే సమయంలో ఆమె కట్టుకునే చీరలకు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది.
ఈసారి నిర్మలా సీతారామన్ తెలుపు రంగు చీరలో మెరిశారు. తెలుపు రంగు చీరకు మెజెంటా రంగు అంచు కలిగి ఉంది. కాగా.. ఈసారి మాత్రమే కాదు.. ఆమె ప్రతి సంవత్సరం బడ్జెట్ రోజున ధరించే విషయంలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఆమె ప్రతిసారీ ఖరీదైన పట్టుచీరలు కాకుండా.. చేనేత చీరలను మాత్రమే ఎంచుకుంటారు. ఈసారి కూడా.. తెలుపు రంగు చీరపై బంగారు మెటిఫ్ లతో, మెజెంటా రంగు బోర్డర్ ఉన్న సిల్క్ చీరలో సింపుల్ గా కనిపించారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా.. ఆమె కట్టుకునే చీరలకు చాలా మంది ఫ్యాన్స్ ఉండటం విశేషం.
కాగా.. ఈ రోజు 11గంటలకు నిర్మలమ్మ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అంతకముందు.. బడ్జెట్ పత్రాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి వెళ్లారు. ఆమె వెంట బడ్జెట్ సంబంధిత అధికారులు కూడా ఉన్నారు.