ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వాహన శ్రేణిలోని 7వ బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రా వాహనాలను వెనక్కి రప్పించుకుంది. బ్రేకింగ్ వ్యవస్థలో లోపాలు ఉండటంతోనే సదరు వాహనాలను వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది.

మార్చి 20, 2019 నుంచి ఏప్రిల్ 30, 2019 మధ్య తయారైన ఈ రెండు వాహన శ్రేణిలో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగా పనిచేయకపోవడంతో సమస్య తలెత్తిందని గుర్తించినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ పేర్కొంది.
undefined
సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా బ్రేక్ కాలిపర్ బోల్ట్స్ లేకపోవడంతో వాటిని సరిచేయనున్నట్లు తెలిపింది. బ్రేకింగ్ వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైనదని పేర్కొంది.
సమస్య ఉన్న సుమారు 7వేల బుల్లెట్లకు స్వచ్ఛందంగా సర్వీస్ చేయనున్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ స్పష్టం చేసింది. ఈ విషయంపై సంబంధిత కస్టమర్లు, స్టేక్ హోల్డర్లకు సమాచారం అందజేయడం జరుగుతోందని తెలిపింది.