మోటార్ సైకిల్స్ తయారీ దిగ్గజం డుకాటీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో నిలదొక్కుకుంటున్న తరుణంలో డుకాటీ కూడా ఆకర్షణీయమైన మోడళ్లలో ద్విచక్ర వాహనాలను తీసుకొస్తోంది.
మోటార్ సైకిల్స్ తయారీ దిగ్గజం డుకాటీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో నిలదొక్కుకుంటున్న తరుణంలో డుకాటీ కూడా ఆకర్షణీయమైన మోడళ్లలో ద్విచక్ర వాహనాలను తీసుకొస్తోంది.
ఈ ఇటాలియన్ వాహన తయారీ సంస్థ మొదట ఒక ఎలక్ట్రిక్ స్కూటర్న్ ప్రారంభించాలని అనుకుంది. ఆ తర్వాత చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ విమోటోతో డుకాటీ చేతులు కలిపింది. ఈ క్రమంలో సంయుక్తంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, మోటారు సైకిల్ తయారు చేయాలని ఇప్పుడు భావిస్తోంది.
undefined
‘డుకాటీ బ్రాండెడ్ సీయూఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్’.. డుకాటీ లైసెన్స్‌తో అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే.. రెండు బ్రాండ్ల మధ్య ఒప్పందం ప్రకారం.. కొత్త ఉత్పత్తి ప్రామాణిక నమూనా మరింత ప్రీమియం వర్షన్‌గా ఉంటుందని, ధర కూడా ఎక్కువగానే ఉంటుందని విమోటో పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు, పంపిణీని విమోటో చేత మార్కెట్ చేయాలని నిర్ణయించాయి. అయితే, మార్కెటింగ్ విభాగం పర్యవేక్షణను డుకాటీ చూసుకుంటుంది.
తమ సొంతంగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డుకాటీ సీఈఓ ఇప్పటికే ప్రకటించారు. సొంత ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెటింగ్ చేసుకోగలిగే వ్యవస్థను డుకాటీ కలిగివుందని తెలిపారు.
విమోటో ఎండీ చార్లెస్ చెన్ మాట్లాడుతూ.. డుకాటీతో విమోటో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రీమియం బ్రాండ్‌తో విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
రెండు సంస్థలు కలిసి విడుదల చేసే వాహనాలకు మంచి మార్కెట్ ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరోప్‌లో మార్కెటింగ్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్లలోనే ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలు మంచి అమ్మకాలను సాధిస్తాయని చెప్పారు.
ఫీచర్ల విషయానికొస్తే..
సూపర్ సోకో బ్రాండ్ కింద సీయూఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సూపర్ సోకోకు విమోటో పేరెంట్ కంపెనీ. 2019 సీయూఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.8కేడబ్ల్యూ(3.75హెచ్‌పీ) బాష్ హబ్ మోటార్, టాప్ స్పీడ్ 45 గంటకు కి.మీ(28ఎంపీహెచ్).
ఈ సీయూఎక్స్ 1.8కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 75కి.మీ దూరం ప్రయాణించవచ్చు. అంతేగాక, ఈ స్కూటర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగివుంది. సోషల్ మీడియా షేరింగ్‌కు ఉపయోగించుకోవచ్చు లేదా డాష్ క్యామ్‌గా పనిచేస్తుంది. కాగా, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో డుకాటీ స్కూటర్ ఓ సంచలనంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.