ఇ-స్కూటర్లను కొంటే ప్రభుత్వ సబ్సిడీ!: రూ. 26వేల వరకు తగ్గింపు

By rajashekhar garrepally  |  First Published May 3, 2019, 3:06 PM IST

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులకు అందజేస్తామని గుర్గావ్ కేంద్రంగా ఉత్పత్తి కొనసాగిస్తున్న ఒకినావా స్కూటర్స్ ప్రకటించింది. 


ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులకు అందజేస్తామని గుర్గావ్ కేంద్రంగా ఉత్పత్తి కొనసాగిస్తున్న ఒకినావా స్కూటర్స్ ప్రకటించింది. ఫేమ్ II (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫాక్చర్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం కింద సబ్సిడీ పొందిన తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం.

ఓఈఎంస్ తగిన రిక్వైర్‌మెంట్స్ చేరుకున్న తర్వాత ఫేమ్ II స్కీం కింద  సబ్సిడీని అందజేయడం జరుగుతుంది. ఒకినావా ఐ-ప్రేజ్ అనేది ప్రీమియం స్కూటర్, ఇది 2,500వాట్ బ్రష్‌లెస్ డీసీ మోటార్ ఉంటుంది. స్కూటర్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే 160-180 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.

Latest Videos

undefined

2.9కేడబ్ల్యూ‌హెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ కలిగివుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 3గంటలు పడుతుంది. ఈ స్కూటర్ రీజనరేటివ్ బ్రేకింగ్ కలిగివుంది. ఫ్రంట్, రేర్ డిస్క్ బ్రేక్స్ కలిగివుంది. ఎల్ఈడీ హెడ్ లైట్స్, డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్స్, అల్యూమినియం అల్లో చక్రాలు ఉన్నాయి. ఒకినావా ఐ ప్రేజ్ ధర రూ. 1.16లక్షలు(ఎక్స్ షోరూం(ఇండియా))గా ఉంది. 

ఇక ఒకినావా రిడ్జ్+ 1200వాట్ బ్రష్‌లెస్ డీసీ మోటర్ కలిగివుంది. 1.75కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ. ఈ స్కూటర్ ను ఫుల్ ఛార్జ్ చేస్తే 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఫ్రంట్, రేర్ లో కూడా డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రేర్‌లో డ్యూయెల్ ట్యూబ్ టెక్నాలజీతో డబుల్ షాకర్. ఈ స్కూటర్ ధర రూ. 79,290(ఎక్స్ షోరూం, ఇండియా)

ఫేమ్ II స్కీం సబ్సిడీ ఎలక్ట్రిక్ వాహనాల ధరను తగ్గిస్తుందని, ఈ వాహనాలు పట్టణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని ఒకినావా ఆటోటెక్ పీవీటీ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. అర్హత కలిగినవారికి సబ్సిడీ అందిస్తామని చెప్పారు. 

ఒకినావా రిడ్జ్+, ఐ ప్రేజ్‌లపై కేడబ్ల్యూహెచ్ ఆధారంగా రూ. 17,000 - రూ. 26,000 వరకు ధర తగ్గుతుందని తెలిపారు. తమ వాహనాలు పర్యావరణం పట్ల బాధ్యతను పెంచుతాయని చెప్పారు. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న తమ వాహనాలను నడుపుతూ ప్రయాణికులు ఆనందాన్ని పొందవచ్చని అన్నారు. ఒకినావా సంస్థ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని తమ వినియోగదారులకు పంచాలనుకోవడం మంచి విషయమే. 

click me!