హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ 615 టచ్ పాయింట్లలో కొనుగోలు చేయవచ్చు. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ .7,088 తగ్గింపును అందిస్తోంది.
ద్విచక్ర వాహనాలలో దిగ్గజ కంపెనీగా ప్రజాదరణ పొంది ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న హీరో కంపెనీ ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద హీరో కంపెనీ హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ లీడ్-యాసిడ్ పవర్డ్ వెర్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రూ .29,990 ధరకే అందిస్తుంది.
also read కియా మోటార్స్ నుండి మరో రెండు కొత్త మోడల్ కార్లు....
undefined
ఒక్క ఈశాన్య భారతదేశం మినహా ఎందుకంటే ఇది అక్కడ 32,710 రూపాయలకు లభిస్తుంది.అంతేకాకుండా హీరో ఎలక్ట్రిక్ అన్నీ లిథియం-అయాన్ పవర్డ్ స్కూటర్ రేంజ్, హీరో ఫ్లాష్ లీడ్-యాసిడ్ స్కూటర్ లపై రూ.10,500 వరకు పేటీఎం ప్రయోజనాలను అందిస్తోంది.
హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ 615 టచ్ పాయింట్లలో కొనుగోలు చేయవచ్చు. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ .7,088 తగ్గింపును అందిస్తోంది.హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ లీడ్-యాసిడ్ 250 W BLDC హబ్ మోటారుతో వస్తుంది. ఇందులో ఉన్న 48 V/28 AH బ్యాటరీ ఎనిమిది గంటల్లో ఛార్జ్ ఫుల్ చార్జ్ అవుతుంది.
also read అమ్మకాలలో హ్యుండాయ్ మోటార్స్ టాప్...ప్యాసింజర్ కార్లు కాస్త బెటర్...
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కి.మీ., ఇంకా 50 కి.మీ వరకు ప్రయాణించగలదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా మీరు హీరో ఫ్లాష్ లీడ్-యాసిడ్ స్కూటర్ నడిపించవచ్చు.ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఈ స్కూటర్ రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం కూడా లేదు.
హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ స్పీడోమీటర్, క్రాష్ గార్డ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఇంకా రి-జనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి.మీరు దేశవ్యాప్తంగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ 615 టచ్ పాయింట్ల నుండి ఫ్లాష్ లీడ్-యాసిడ్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.