హోండా నుండి మరో కొత్త మోడల్ బైకు...ధర ఎంతో తెలుసా...

By Sandra Ashok Kumar  |  First Published Jan 17, 2020, 11:12 AM IST

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ తాజాగా విపణిలోకి మూడో మోడల్ యాక్టీవా స్కూటీని విపణిలోకి ఆవిష్కరించింది. అయితే, ఇప్పట్లో దేశీయంగా ఆటోమొబైల్ రంగం కోలుకోవడం అనుమానమేనని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు వైఎస్ గులేరియా తెలిపారు. జీఎస్టీలో తగ్గుదల నమోదైతే దాన్ని వినియోగదారుడికి బదిలీ చేస్తామన్నారు.
 


ముంబై: హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ విపణిలోకి బీఎస్‌-6 శ్రేణిలో సరికొత్త యాక్టివాను ఆవిష్కరించింది. 110 సీసీ సామర్థ్యంతో ఈ యాక్టీవా మార్కెట్‌కు పరిచయమైంది. స్టాండర్డ్‌, డీలక్స్‌ అనే రెండు రకాల్లో ఆవిష్కృతమైన ఈ టూవీలర్‌ ప్రారంభ ధరను రూ.63,912గా హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ నిర్ణయించింది.

also read 

Latest Videos

undefined

ఈ నెలాఖరు, వచ్చే నెలారంభం మధ్య కొనుగోలుదారులకు అందిస్తామని హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తెలిపింది. బీఎస్‌-6 శ్రేణిలో ఇప్పటికే రెండు మోడల్ మోటారు సైకిళ్లను హోండా తెచ్చిన విషయం తెలిసిందే. తాజా యాక్టివా మూడో మోడల్‌ కాగా, ఇందులో హోండా ఎకో టెక్నాలజీ ఇంజిన్‌, ఈఎస్‌పీ టెక్నాలజీలు ఉన్నాయని సంస్థ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు వైఎస్‌ గులేరియా వెల్లడించారు. 

కాగా, సమీప భవిష్యత్‌లో దేశీయ ఆటో రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు తొలిగే వీల్లేదని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు వైఎస్ గులేరియా అన్నారు. ప్రస్తుతం దేశీయంగా అమలులో ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో తమ రంగానికి రాయితీలు ఇవ్వలేదని చెప్పారు.

ఒకవేళ ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ తగ్గిస్తే, దాంతో వినియోగదారుడికి లబ్ధి చేకూరుతుందని బజాజ్ ఆటోమొబైల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు వైఎస్ గులేరియా చెప్పారు. అందుకు సానుకూల సంకేతాలేమీ కనిపించడం లేదన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలు గల వాహనాలను మాత్రమే విక్రయించడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే.

also read   అందుబాటులోకి ‘క్యూ’ ఫ్యామిలీ.. భారత విపణిలోకి ఆడి క్యూ8

హోండా మోటారు సైకిల్స్ డిమాండ్‌కు అనుగుణంగా చౌకధరకు వినియోగదారులకు అందుబాటులోకి వాహనాలను తీసుకువచ్చేందుకు వాహనాల బేసిక్ అప్ గ్రేడ్ చేస్తామని వైఎస్ గులేరియా తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వినియోగదారులను మోటివేట్ చేస్తామన్నారు. ఎప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమ రివైవల్ అవుతుందో చెప్పలేమని తెలిపారు.

విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో యాక్టీవా 125ను విడుదల చేసిన సంస్థ హోండా మోటారు సైకిల్స్ అని ఆ సంస్థ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కాటో తెలిపారు. యాక్టీవా 125 మోడల్ బైక్‌లో ఎస్పీ 125 బైక్ ఆవిష్కరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ రెండు మోడల్ స్కూటీలు 75 వేల యూనిట్లు విడుదల చేస్తున్నమని మినోరు కాటో తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్లపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. 
 

click me!