మార్కెట్లోకి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్...ఫీచర్స్, ధరెంతంటే!!

By Sandra Ashok Kumar  |  First Published Jan 9, 2020, 11:26 AM IST

1980వ దశకంలో దేశ ప్రజలందరికీ సుపరిచితం బజాజ్ చేతక్ స్కూటర్. తాజాగా ఆ స్కూటర్‌ను విద్యుత్ వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది బజాజ్ ఆటోమొబైల్. ఈ నెల 14వ తేదీ నుంచి లిథియం ఆయాన్ బ్యాటరీతో కూడిన విద్యుత్ బజాజ్ చేతక్ స్కూటర్ వినియోగదారులకు లభిస్తుంది. పుణెలోని చకన్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులంతా మహిళలే కావడం గమనార్హం.


ముంబై: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం త్వరలో మార్కెట్లోకి రాబోతున్నది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల విషయమై పలు విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెల 20వ తేదీన సంస్థ ఈ ద్విచక్రవాహనాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. 

also read హ్యుందాయ్ నుండి కొత్త అప్ డేట్ లేటెస్ట్ మోడల్ కార్....

Latest Videos

undefined

ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.20లక్షలు ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ ద్విచక్రవాహన విక్రయాలను తొలుత పుణెలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా బెంగళూరుతోపాటు ఇతర మెట్రోనగరాల్లోనూ విక్రయిస్తామని సంస్థ ఇదువరకే తెలిపింది. స్కూటర్ విడుదల చేసిన తర్వాత బుకింగ్స్ ప్రారంభం అవుతాయని సంస్థ వెల్లడించింది. 

ఈ స్కూటర్‌కు నాలుగు కిలోవాట్ల విద్యుత్ మోటర్, దానికి శక్తినిచ్చేలా లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో దాదాపు 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో దాదాపు 85 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌కు అన్ని రకాల ఆధునిక రైడింగ్ సదుపాయాలు కల్పించారు. మెటల్ బాడీ, ఎల్ఈడీ లైట్లు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఫీచర్లు ఉండనున్నాయి.

also read CES 2020: హోండా నుండి ఆగ్మెంటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్‌ కార్ 

అలాయ్ వీల్స్తో పాటు దీనికి ప్రభావవంతమైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ సిస్టమ్ అమర్చినట్లు సంస్థ గతంలో వెల్లడించింది. ఈ స్కూటర్‌కు మూడేళ్లు లేదా, 50వేల కిలోమీటర్లు వారెంటీ పొందవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని చకన్ కర్మాగారంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ చేపట్టినట్లు బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్ ఇదువరకే తెలిపారు.

ఈ కర్మాగారంలో మొత్తం మహిళా కార్మికులే తయారీలో పాల్గొంటారు. ఇప్పటికే ఈ స్కూటర్ బజాజ్ సంస్థ చేతక్ యాత్రలో భాగంగా పలు నగరాల మీదుగా 3వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని పూర్తి చేసింది.
 

click me!