మార్కెట్లోకి బీఎస్-6 టెక్నాలజితో సుజుకి బైక్...

By Sandra Ashok Kumar  |  First Published Jan 7, 2020, 12:51 PM IST

గడువు దగ్గర పడుతున్నా కొద్దీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన బైక్స్, స్కూటర్లు, కార్ల ఆవిష్కరణలో బిజీబిజీగా ఉన్నాయి ఆటోమొబైల్ సంస్థలు. ఆ క్రమంలో టీవీఎస్ సుజుకి మోటార్ సైకిల్స్ విపణిలోకి యాక్సెస్ మోడల్ స్కూటర్ ఆవిష్కరించింది.
 


న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యాక్సెస్‌-125 స్కూటర్‌ను విపణిలోకి ఆవిష్కరించింది. దీని ధరను రూ.64,800- 69,500గా నిర్ణయించింది. స్టాండర్డ్‌ వేరియంట్‌తో పాటు అల్లాయ్ డ్రమ్‌ బ్రేక్‌, అల్లాయ్ డిస్క్‌ బ్రేక్‌, స్టీల్‌ డ్రమ్‌ బ్రేక్‌ ఆప్షన్లు కలిగిన స్పెషల్‌ వేరియంట్‌లలో కూడా కంపెనీ ఈ కొత్త వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది.

also read టయోటా ఇన్నోవా క్రిస్టా బి‌ఎస్ 6 వెర్షన్ బుకింగ్స్ చేయాలనుకుంటున్నారా...?

Latest Videos

undefined

స్టాండర్డ్‌ వేరియంట్‌ యాక్సెస్ స్కూటర్ ధర రూ.64,800 వద్ద, స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ.68,500 వద్ద ప్రారంభమవుతాయని సుజుకీ తెలిపింది. భారతీయుల మది దోచుకున్న యాక్సెస్‌ వాహనం.. తమ సంస్థ ఎదుగుదలలో కీలక పాత్రను పోషిస్తూ వస్తోందని సుజుకీ వివరించింది. యాక్సెస్‌ పనితీరు పట్ల వినియోగదారుల నుంచి ప్రశంసలందాయని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొయిచిరో హిరావో తెలిపారు. 

వీటిని నిలబెట్టుకుని ముందుకు సాగే ప్రయత్నంలోనే భాగంగా బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలు కల యాక్సెస్‌-125 స్కూటర్‌ మార్కెట్లోప్రవేశ పెడుతున్నట్లు సుజుకీ తెలిపింది. కొత్త వాహనం కూడా వినియోగ దారుల అంచనాలను అందుకోగలదని సంస్థ ఒక ప్రకటనలో సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసింది.

also read కియా ‘సెల్టోస్‌’కారు ధరల పెంపు... ఎంత పెరిగిందో తెలుసా...

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలు దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్తులో తమ ఇతర ఉత్పత్తుల్లోనూ మార్పు చేస్తామని వెల్లడించింది.ఎల్ఈడీ హెడ్ లైట్, స్పీడో మీటర్ పై ఎకో లైట్, బ్యాటరీ పరిస్థితిని తెలిపే వోల్టేజీ మీటర్‌ డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

click me!