టీవీఎస్ మోటారు సైకిల్స్ మినహా వివిధ సంస్థల మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాల్లో పతనం నమోదైంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అన్ని బైక్స్, స్కూటర్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరోసారి దారుణంగా పడి పోతున్నాయి. 2019 డిసెంబర్ నెలలో దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలూ సేల్స్ తగ్గినట్లు ప్రకటించాయి. హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటార్ సైకిల్స్, టీవీఎస్ మోటార్స్ కంపెనీలు వాటిల్లో ఉన్నాయి. కాగా సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎంఐపీఎల్) మాత్రమే తమ అమ్మకాలు స్వల్పంగా పెరిగినట్లు పేర్కొంది.
హీరో మోటో కార్ప్ డిసెంబర్ నెలలో 4,24,845 వాహనాలు విక్రయించింది. 2018 డిసెంబర్‌లో ఆ కంపెనీ 4,53,985 యూనిట్లు అమ్మకాలు చేపట్టింది. 2018తో పోల్చినప్పుడు అమ్మకాల్లో 6.41 శాతం తగ్గుదల కనిపించింది. మోటారు సైకిళ్ల విభాగంలో 2018 డిసెంబర్ నెలలో 4,17,612 మోటారు సైకిళ్లు విక్రయించగా, 2019 డిసెంబర్ నెలలో 4,03,625 అమ్ముడు అయ్యాయి.
undefined
also read ఆటోమొబైల్ విక్రయాలకు నిరాశ... మారుతి & మహీంద్రాకు మాత్రమే గ్రోత్
హీరో మోటో కార్ప్స్ స్కూటర్ల విభాగంలో 41.66 శాతానికి సేల్స్ పడిపోయాయి. 2018తో పోలిస్తే 36,373 యూనిట్లు సేల్ అయితే 2019లో 21,220 స్కూటర్లకు పడిపోయాయి. విదేశాలకు ఎగుమతిలోనూ తగ్గుముఖం పట్టింది. 2018 డిసెంబర్ నెలలో 17,394 యూనిట్లు విక్రయించగా, గతేడాది 12,836 వెహికల్స్ కు పడిపోయాయి.
2018తో పోలిస్తే 2019 డిసెంబర్ బజాజ్ ఆటో విక్రయాలు మూడు శాతం తగ్గాయి. 2019లో 3,36,055 యూనిట్లు విక్రయించింది. 2018 డిసెంబర్ నెలలో 3,46,199 స్కూటర్లు, బైక్స్ అమ్మిది బజాజ్ ఆటో. దేశీయంగా బజాజ్ ఆటోమొబైల్స్ సేల్స్ 15 శాతం తగ్గాయి. 2018 డిసెంబర్ నెలలో 1,80,351 యూనిట్లు అమ్మితే గతేడాది 1,53,163 యూనిట్లకు పడిపోయాయి.
మోటారు సైకిల్స్ విభాగంలో దేశీయంగా సేల్స్ 1,57,252 యూనిట్ల నుంచి 1,24,125 యూనిట్లకు పడిపోయాయి. బైక్స్ విభాగం విక్రయాలు 21 శాతం తగ్గాయి. అయితే విదేశాలకు ఎగుమతుల్లో మాత్రం 13 శాతం పెరుగుదల నమోదైంది. బజాజ్ ఆటో కమర్షియల్ వెహికల్స్ సేల్స్ ఎనిమిది శాతం పెరిగి 47,344 యూనిట్ల నుంచి 51,253 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా 2018లో సేల్స్ 28,099 నుంచి 29,038 యూనిట్లకు పెరిగాయి. దేశీయ సేల్స్ విభాగంలో 26 శాతం పురోగతి నమోదైంది.
టీవీఎస్ అమ్మకాలు సైతం 25 శాతం మేర తగ్గాయి. 2019 డిసెంబర్ నెల 1,57,244 యూనిట్లు విక్రయించిన ఆ కంపెనీ గతేడాది ఇదే సమయంలో 2,09,906 యూనిట్లు అమ్మింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు 2019 డిసెంబర్‌లో 13 శాతం తగ్గాయి. 50,416 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందేడాది ఇదే సమయంలో సంస్థ 58,278 యూనిట్లు విక్రయించింది. దేశీయంగా 2018లో 56,026 బైక్స్ అమ్మింది.
ఇదిలా ఉండగా విదేశాలకు 2018 డిసెంబర్ నెలలో 2,252 బైక్స్ ఎగుమతి చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్. గతేడాది ఎగుమతులు 14 శాతం తగ్గి 1927 యూనిట్లకు తగ్గిపోయాయి. దేశీయంగా ఒక్క టీవీఎస్ సుజుకీ అమ్మకాలు మాత్రమే 1.1 శాతం పెరిగాయి. 44,368 యూనిట్ల వాహనాలు అమ్మకాలు జరిగాయి. ఆ కంపెనీ గతేడాది 43,874 యూనిట్లు విక్రయించడం గమనార్హం.
also read విపణిలోకి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్.. 9శాతం అధిక మైలేజీ.. ధరెంతంటే?!
దేశీయంగా విక్రయాలు, విదేశాలకు ఎగుమతిలో మాత్రం తగ్గుముఖం పట్టాయి. దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలుపుకుని 2018లో 52,362 బైక్స్ అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్ నెలలో 52,351 బైక్స్ విక్రయించింది రాయల్ ఎన్‌ఫీల్డ్. కాగా డిసెంబర్ నెలతో ముగిసిన సంవత్సరంలో దేశంలో ప్రయాణ వాహనాల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి.
ఎస్ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొచిరో హిరావో మాట్లాడుతూ ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం నెలకొన్నా స్వల్పంగా పెరిగాయన్నారు. ఈ ఏడాది తమ వాహనాలను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తామన్నారు.ద్విచక్ర వాహనాలతో సహా ఇతర ప్రయాణ వాహనాలైన కార్లు, ఎస్‌యూవీ మోడల్ కార్ల అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వాహన విక్రయాలు మూడు మిలియన్ల మ్యాజిక్ స్థాయికి దిగువన నమోదు అయినట్టుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.