కే‌టి‌ఎం బైక్ కి పోటీగా బజాజ్ కొత్త బైక్

By Sandra Ashok Kumar  |  First Published Mar 11, 2020, 4:58 PM IST

బజాజ్ డొమినార్ 250సి‌సి బైక్ భారతదేశంలో 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు ప్రారంభించింది.బజాజ్ డొమినార్ 400సి‌సి కి ఇది బేబీ డొమినార్ అని అలాగే బజాజ్ డొమినార్ 400సి‌సి సాధించిన అదే విజయాన్ని ఇది కూడా సాధిస్తుందని తెలిపింది.


ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ బజాజ్ ఇప్పుడు కొత్త డొమినార్ 250సి‌సి బైకును భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)అని తెలిపింది. భారతదేశంలో బజాజ్‌ డొమినార్ 400సి‌సి విజయవంతమైన మోడల్‌. దానితో పాటు డొమినార్ 250సి‌సి మరో విజయవంతమైన మోడల్‌ కానుంది అని తెలిపింది.

బజాజ్ డొమినార్ 250సి‌సి బైక్ భారతదేశంలో 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు ప్రారంభించింది. బజాజ్ డొమినార్ 400సి‌సి కి ఇది బేబీ డొమినార్ అని అలాగే బజాజ్ డొమినార్ 400సి‌సి సాధించిన అదే విజయాన్ని ఇది కూడా సాధిస్తుందని తెలిపింది.

Latest Videos

undefined

also read మహాబుబ్‌నగర్‌లో ఇటాలియన్ బైక్స్ బెనెల్లి ప్రత్యేకమైన షోరూం...

బజాజ్ డొమినార్ 250సి‌సి బైక్ స్పోర్ట్ టూరింగ్ మెషీన్‌గా బైక్ లవర్స్ ను ఆకర్షించనుంది. డొమినార్ 250 బైక్ కే‌టి‌ఎం డ్యూక్  250 లాంటి ఇంజిన్ ఉపయోగించింది. ఇది 248.8 సిసి సింగిల్ సిలిండర్, 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 26 బిహెచ్‌పి అందిస్తుంది. 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 ఎన్ఎమ్  టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

 కొత్త  BS 6 కంప్లైంట్ ఇంజిన్, స్లిప్పర్ క్లచ్‌,  6-స్పీడ్ గేర్‌బాక్స్‌ దీనికి అమర్చారు. డొమినార్ 250 స్పీడ్ విషయానికొస్తే132 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్లగలాదు. కేవలం 0-100 కిలోమీటర్ల వేగాన్ని 10.5 సెకన్లలో చేరుకోగలదు.

డొమినార్ 250 బైక్ గురించి బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే మాట్లాడుతూ డొమినార్ బ్రాండ్ తనకంటూ ఒక బలమైన ఫాలోయింగ్‌ను సృష్టించగలిగింది. అలాగే బైక్స్ పై  లాంగ్ టూర్స్ వెళ్ళే పర్యాటకులకు ఇష్టపడే ఎంపికగా మారింది.

also read ట్రాఫిక్ నుండి ఆకాశంలోకి ఎగిరే కారు...వచ్చే ఏడాది అందుబాటులోకి...

డొమినార్ బైక్ రైడర్స్ ఐదు ఖండాలను దాటి, ఆర్కిటిక్, అంటార్కిటికాకు వేలాది మైళ్ళు ప్రయాణించి, డొమినార్ 400 బైక్‌ అంటే ఎంటో నిరూపించారు. పర్యాటక ప్రపంచంలోకి రావాలనుకునే వారికి డొమినార్ 250 అనువైన బైక్ అవుతుంది అని అన్నారు

డొమినార్ 250సి‌సి బైకుకి అడ్జస్టబుల్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌, 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 230 ఎంఎం బ్యాంక్ డిస్క్  ఉంది.

ఇతర ఫీచర్స్ ఆటో-హెడ్‌ల్యాంప్స్ ఆన్ (AHO) ఫీచర్‌తో ఫుల్ ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్, ట్విన్-బారెల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. బజాజ్ డొమినార్ 250సి‌సి బైక్ కాన్యన్ రెడ్, వైన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో కేవలం ఒక వేరియంట్  మాత్రమే ఉంది.
 

click me!