బీఎస్-4 ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల డీలర్ల వద్ద నిల్వ ఉన్న బీఎస్-4 బైక్స్ విక్రయానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటం దీనికి కారణం.
ముంబై: టూ వీలర్, కమర్షియల్ వెహికల్స్ తయారీ దారులు, విక్రేతలు, డీలర్లు బీఎస్-4 ప్రమాణాలతో కూడిన బైక్స్, వాణిజ్య వాహనాలపై భారీ స్థాయిలో ఆఫర్లు, రాయితీలు ప్రకటించనున్నాయి. ఎందుకంటే బీఎస్-4 వాహనాల విక్రయానికి ఇక మూడు వారాల్లోపు సమయం మాత్రమే మిగిలి ఉందని ఆటోమొబైల్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు గుర్తు చేశారు.
ఆటోమొబైల్ సంస్థల వద్ద గణనీయ స్థాయిలోనే బీఎస్-4 వాహనాల నిల్వలు ఉన్నాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి బీఎస్-6 వాహనాల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. హీరో ప్లీజర్, మాస్ట్రో స్కూటర్లపై ఎక్స్చేంజ్ బోనస్‌తోపాటు రూ.10 వేల డిస్కౌంట్లు ఇస్తున్నది.
undefined
మహీంద్రా పికప్, కంపర్, మ్యాక్సీ ట్రక్ వెహికల్స్ పై రూ.40 వేల రాయితీలు అందిస్తున్నది. మరోవైపు బీఎస్-4 వాహనాల విక్రయాలపై భయపడొద్దని దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి.
also read మీ బైక్ కోసం హోలీ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ టైర్లు...
2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకు ద్విచక్ర వాహనాల విక్రయాలు సుమారు 13 శాతం పడిపోయి, 15.26 మిలియన్ల యూనిట్లకు చేరుకున్నాయి. ఆరేడు నెలలుగా బీఎస్-4 వాహనాల ఉత్పత్తి, విక్రయాలపై కంపెనీలు ఆంక్షలు విధించాయి.
ఇదిలా ఉంటే, బీఎస్-4 ప్రమాణాలతో రూపొందించిన వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెలాఖరుతో ముగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లపై తాజాగా ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమలు కానున్నందున పాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల చివరినాటికి ముగించేయాలని ఆదేశిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో భారీ స్థాయిలో వాహనాల నిల్వలను కలిగి ఉన్న వాహన రంగ కంపెనీలతోపాటు డీలర్లు, షోరూమ్‌ల యజమానులు హడలెత్తిపోతున్నారు. మొన్నటివరకు పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తి వేగంగా ఉన్నందువల్ల షోరూంలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయి అమ్మకాలు నిలిచిపోయాయని ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్నాయి.
విజృంభిస్తున్న వైరస్ కోణంలో చూస్తే గడువు తేదీలోపు బీఎస్–4 వాహన విక్రయాలను పూర్తి చేయడం కష్టమేనని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. రోవైపు పాత వాహనాల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తికావాలని పలు రాష్ట్ర రవాణా విభాగాలు డీలర్లకు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు ఫాడా వెల్లడించింది.
also read మారుతి సుజుకి కొత్త కార్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...
పేరుకుపోయిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్ కాలే అన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని చెప్పారు.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల వద్ద అన్ని విభాగాలకు చెందిన పాత వాహనాల నిల్వలు అధిక స్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర నిల్వలు అధికంగా ఉన్నాయని వివరించారు.
వీటి ఇన్వెంటరీ 20–30 రోజులుగా ఉందన్నారు. ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్)తో కలిసి సంప్రదింపులు నిర్వహించనున్నామని, ఇందుకు తగిన పరిష్కార మార్గం దొరక్కపోతే డీలర్లు భారీ స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వివరించారు.