1 లీటర్ నీళ్లు చాలు.. 150 కి.మీ వెళ్లొచ్చు! వాటర్ స్కూటర్ వచ్చేసింది..

By Ashok Kumar  |  First Published Jul 30, 2024, 6:54 PM IST

జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్‌విజార్డ్ ఈ పని చేసింది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేసే కంపెనీ నీటితో నడిచే స్కూటర్‌ను విడుదల చేసింది. 


పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దింతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తుంది. మరోవైపు బజాజ్ కంపెనీ  ఫ్రీడమ్ 125 CNG బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ప్రస్తుతం  వాటర్ పవర్డ్ స్కూటర్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి  అంటే మీరు అస్సలు నమ్మరు. ఇది ఎలా సాధ్యం ?  అని అనుకుంటున్నారా..  జాయ్ ఇ-బైక్ నీటితో నడిచే స్కూటర్‌ను లాంచ్ చేసి దీనిని  సాధ్యం చేసింది.

జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్‌విజార్డ్ ఈ పని చేసింది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేసే కంపెనీ నీటితో నడిచే స్కూటర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో స్వచ్ఛమైన ఇంధనం కోసం హైడ్రోజన్ టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంకా  కాలుష్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. జాయ్ ఇ-బైక్ భారతదేశంలో ఈ సంవత్సరం మొబిలిటీ షోలో నీటితో నడిచే స్కూటర్‌ను ఆవిష్కరించింది.

Latest Videos

undefined

నిజానికి ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్‌తో నడుస్తుంది. ఈ వాహనాల టెక్నాలజీ  హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి నీటి అణువులను విభజిస్తుంది. ఇది స్కూటర్లలో ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ఈ ఇంధనంతో స్కూటర్ నడుస్తుంది. నీటితో నడిచే స్కూటర్లు చాలా వేగంగా వెళ్ళలేవు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్  గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్ స్పీడ్ తక్కువ. ఈ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఈ స్కూటర్‌ను నడపవచ్చు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు హైడ్రోజన్ పవర్డ్ వాహనాలను పరిచయం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి.

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్‌తో 150 కిలోమీటర్లు వెళ్లగలదు. ప్రస్తుతం ఈ ఇ-స్కూటర్ గురించి చర్చ జరుగుతోంది.  కాబట్టి ఈ స్కూటర్ ఇంకా అమ్మకానికి అందుబాటులో లేదు.  ఈ టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

click me!