నిస్సాన్ కొత్త SUV మోడల్‌ని కంపెనీ ప్రదర్శించింది. దీని ధర త్వరలో ప్రకటించనుంది. ఈ కారు మూడు వరుసల SUV.. త్వరలోనే లాంచ్ తేదీ కూడా తెలియనుంది.
మాగ్నైట్‌తో భారత మార్కెట్లో ఓ మెరుపు మెరిసిన నిస్సాన్ ఇండియా చాలా కాలం తర్వాత కొత్త SUV నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ SUVని కంపెనీ మాత్రమే ప్రదర్శించింది. దీని ధర త్వరలో ప్రకటించనుంది. అయితే ఈ కారు 3-రో సిటింగ్ SUV అవుతుంది. ప్రస్తుతం, కంపెనీ లాంచ్ తేదీని ప్రకటించలేదు. త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
డిజైన్ గురించి మాట్లాడితే.. ఈ SUV డార్క్ క్రోమ్, LED DRLs, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, LED టెయిల్ ల్యాంప్‌తో కూడిన V-మోషన్ గ్రిల్ ఉంటుంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUVని వైట్, గ్రే, బ్లాక్ రంగులలో వస్తుంది. దీని పొడవు 4680 mm, వెడల్పు 1840 mm, ఎత్తు 1725 mm, వీల్ బేస్ 2705 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 210 mm.
నిస్సాన్ నుండి వచ్చిన ఈ కొత్త కారులో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పుష్ స్టార్ట్ బటన్‌తో కీలెస్ ఎంట్రీ, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పాడిల్ షిఫ్టర్లు, ఆటో హోల్డ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు చూడవచ్చు.
సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటో వైపర్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉంటాయి. X-ట్రైల్ 7-సీటర్ మోడల్‌లో 1.5-లీటర్, త్రి-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 12-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇంజిన్‌తో పాటు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు. ఈ సెటప్ 163 bhp పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా భారతదేశంలోకి దిగుమతి అవుతుంది. లాంచ్ తర్వాత స్కోడా కొడియాక్, MG గ్లోస్టర్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్‌లతో పోటీగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 40 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ. 45 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంటుంది.