గెట్ రెడీ.. మార్కెట్లోకి ఆగస్ట్ 2న ఫ్రెంచ్ బ్రాండ్ కొత్త కార్.. ఫుల్ ఫీచర్స్ ఇవే..

By Ashok KumarFirst Published Jul 20, 2024, 9:36 PM IST
Highlights

 సిట్రోయెన్ బసాల్ట్ ఒక కూపే SUV, ఇది రాబోయే టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మిడ్-సైజ్ SUVలతో నేరుగా పోటీపడుతుంది. 
 

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ సి-క్యూబ్డ్ ప్రోగ్రాం కింద బ్రాండ్ నాలుగో మోడల్ అయిన సిట్రోయెన్ బసాల్ట్‌ ఆగస్ట్ 2, 2024న భారతదేశంలో ఎంట్రీ  చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే, దీని ప్రారంభ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సిట్రోయెన్ బసాల్ట్ ఒక కూపే SUV. ఇది రాబోయే టాటా కార్వీ, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మిడ్-సైజ్ SUVలతో  పోటీపడుతుంది. సిట్రోయెన్ 2025 ప్రారంభంలో బసాల్ట్ ఎలక్ట్రిక్ం వెర్షన్‌ను కూడా పరిచయం చేయనుంది.

రెండు-భాగాల గ్రిల్, క్రోమ్డ్ చెవ్రాన్ లోగో, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, LED DRLs, బానెట్ లాంటి కొన్ని డిజైన్ అంశాలు C3 ఎయిర్‌క్రాస్ నుండి ప్రేరణ పొందాయని నివేదించింది. ఫ్రంట్ గ్రిల్ ఇన్‌సర్ట్‌లు కొంచెం భిన్నమైన ఫినిషింగ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు (హాలోజన్ యూనిట్‌లకు బదులుగా), స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లు విభిన్న క్లాడింగ్‌లు, రెండు వైపులా పించ్డ్ విండో లైన్‌ ఉంటాయి. పుల్-టైప్ డోర్ హ్యాండిల్స్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు, నలుపు ఇంకా  సిల్వర్ ఫినిషింగ్‌తో డ్యూయల్-టోన్ బంపర్‌ కూడా ఉండేలా డిజైన్ కనిపిస్తోంది. 

Latest Videos

సుమారు 4.3 మీటర్ల పొడవుతో సిట్రోయెన్ బసాల్ట్ C3 ఎయిర్‌క్రాస్ కంటే ఎక్కువ ఫీచర్స్‌తో  ఉంటుంది. ఇతర C-క్యూబ్డ్ మోడల్‌లాగ  కాకుండా, కొత్త కూపే SUV ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ,  క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లను అందించవచ్చు.

కూపే SUVలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేసిన కార్ టెక్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, ముందు, వెనుక USB ఛార్జర్‌లు, హిల్ హోల్డ్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు,  టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఈ కారులో కూడా పొందవచ్చు. 

బసాల్ట్ కూపే SUV ఇతర C-క్యూబ్ మోడల్‌లాగానే  1.2L, 3-సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. గరిష్టంగా 110 bhp శక్తిని,  205 Nm పీక్ టార్క్‌, మ్యాన్యువల్ & 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అప్షన్‌తో అందిస్తుంది.

 SUV సెగ్మెంట్‌లో సిట్రోయెన్ బసాల్ట్ రాబోయే టాటా కర్వీతో నేరుగా పోటీపడుతుంది. ఇది కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, విడబ్ల్యు టిగువాన్, స్కోడా కుషాక్‌లతో సహా ప్రముఖ మిడ్-సైజ్ SUVలతో కూడా పోటీపడుతుంది.

click me!