టీవీఎస్ రెండు బైక్‌లను అమెరికా ఖండంలోని మెక్సికోలో విడుదల చేసింది. మెక్సికన్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ రెండు బైక్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్స్ టివిఎస్ ఆర్‌టిఆర్ 200 4V అండ్ టివిఎస్ ఆర్‌ఆర్ 310.
భారతీయ ద్విచక్ర వాహన సంస్థ టివిఎస్ కొత్త లాంచ్‌లతో విదేశాల్లో ఉనికిని నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. తాజాగా ఒక దేశంలో రెండు కొత్త బైక్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు బైక్‌లు పర్ఫర్మెంస్ విభాగానికి చెందినవి. అయితే ఈ రెండు బైక్‌లను ఏ దేశంలో విడుదల చేశారు, వాటి ధర ఎంత, వాటిలో ఏ ఫీచర్లు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకొండి...
ఏ బైక్‌లను లాంచ్ చేశారు
undefined
టీవీఎస్ రెండు బైక్‌లను అమెరికా ఖండంలోని మెక్సికోలో విడుదల చేసింది. మెక్సికన్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ రెండు బైక్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్స్ టివిఎస్ ఆర్‌టిఆర్ 200 4V అండ్ టివిఎస్ ఆర్‌ఆర్ 310.
బిజినెస్ హెడ్
లాంచ్ సందర్భంగా పలువురు కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీ మాట్లాడుతూ మెక్సికోలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ ఆర్‌ఆర్ 310 అండ్ టీవీఎస్ ఆర్‌టిఆర్ 200లను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు.
ఆర్‌ఆర్ 310 ఎలా ఉంటుందంటే
టివిఎస్ నుండి వస్తున్న కొత్త RR 310 BS-VI బైక్‌కు థొరెటల్-బై-వైర్ టెక్నాలజీ ఇచ్చారు. ఈ బైక్ రేసింగ్ ప్రత్యేకతతో బైకర్‌కు చాలా సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. బైక్ కి ఐదు అంగుళాల నిలువు TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌న ఉంది. అంతేకాకుండా, బ్లూటూత్ ఎనేబుల్డ్ SmartX కనెక్ట్ కూడా ఇందులో ఉంది. బైక్‌లో రైడింగ్ కోసం అర్బన్, రెయిన్, స్పోర్ట్ అండ్ ట్రాక్ వంటి నాలుగు మోడ్‌లు ఇచ్చారు.
ఆర్‌టిఆర్ 200 4V ఎలా ఉంటుందంటే
మెక్సికోలో టివిఎస్ కంపెనీ మరో బైక్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్ పేరు ఆర్‌టిఆర్ 200 4V. దీనికి ఆకర్షణీయమైన రేసింగ్ గ్రాఫిక్స్‌తో కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఇచ్చారు. క్లా స్టైల్ పొజిషన్ ల్యాంప్‌తో మెరుగైన లాంగ్ రేంజ్ అందిస్తుంది. RTR సిరీస్‌లో రేస్ ట్యూన్డ్-ఫ్యూయల్ ఇంజెక్షన్ RT-Fi టెక్నాలజి అందించారు. ఈ బైక్ ని అన్ని రకాల డ్రైవింగ్ పరిస్థితులలో ఉల్లాసకరమైన రేసింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.