వోక్స్‌వ్యాగన్ కార్ల ధరల పెంపు: ఏ మోడల్ పై ఎంత పెరగవచ్చంటే..?

By asianet news teluguFirst Published Dec 17, 2022, 1:03 PM IST
Highlights

టైగన్ ని భారతదేశంలో రూ. 10.50 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించారు. ఈ టైగన్ SUV ధరలు చాలా సార్లు పెంచారు,  ఇప్పుడు దీని ధర రూ. 11.55 లక్షలు, ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. 
 

ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో మొత్తం మోడల్ లైనప్ ధరలను మళ్లీ పెంచేందుకు సిద్ధంగా ఉంది. వాహనాలపై పెరిగిన కొత్త ధరలు 1 జనవరి 2023 నుంచి వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొత్తం 3 ప్రాడక్ట్స్ విక్రయిస్తోంది - Tiguan, Taigun, Virtus. టిగువాన్ ప్రీమియం విభాగంలోకి వస్తుంది, అయితే టైగన్ అండ్ వర్టస్ రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల ధర పరిధిలోకి వచ్చే కార్లు.

టైగన్ ని భారతదేశంలో రూ. 10.50 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించారు. ఈ టైగన్ SUV ధరలు చాలా సార్లు పెంచారు,  ఇప్పుడు దీని ధర రూ. 11.55 లక్షలు, ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. 


అయితే, కార్ల తయారీ సంస్థ ఏ  మోడల్ ధర ఎంత పెరుగుదల అనేది వెల్లడించలేదు. అయితే ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా, కార్‌ కంపెనీ తాజాగా వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్రాండ్  గ్లోబల్ బెస్ట్ సెల్లర్ 2.0L TSI ఇంజిన్‌తో మోడల్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 187 hp శక్తిని, గరిష్టంగా 320 Nm టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 7-స్పీడ్ DCT గేర్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది, ఇది 4MOTION టెక్నాలజీ ద్వారా అన్ని వీల్స్ కి శక్తిని పంపుతుంది. 

Taigun అండ్ Virtus విషయానికి వస్తే, ఈ రెండు కార్లు MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ మోడల్‌లు రెండు ఇంజన్ ఆఫన్స్ లో లభిస్తాయి - 1.0-లీటర్ TSI అండ్ 1.5-లీటర్ TSI EVO ఇంజిన్‌లు. 1.0-లీటర్ యూనిట్ 3-పాట్ పెట్రోల్ ఇంజన్,  114 bhp అండ్ 178 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ AT గేర్‌బాక్స్ ఆప్షన్  ఉంది. 1.5-లీటర్ యూనిట్ 148 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ MT అండ్ 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో విక్రయిస్తున్నారు.
 

click me!