కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్ ఆగస్ట్ 2022లో లాంచ్ జరిగింది. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో వస్తుంది - డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో. డీలక్స్ ధర రూ.2.26 లక్షలు, డీలక్స్ ప్రొ ధర రూ.2.29 లక్షలు.
హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా కస్టమర్లను ఆకర్షించడానికి ఇంకా సేల్స్ పెంచుకోవడానికి తాజాగా లాంచ్ చేసిన కొత్త CB300F నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌పై ఆఫర్‌లను ప్రకటించింది. హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్ హోండా CB300F బైక్స్ పై రూ.50,000 బంపర్ తగ్గింపును అందిస్తోంది.
వేరియంట్లు అండ్ కొత్త ధర
కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్ ఆగస్ట్ 2022లో లాంచ్ జరిగింది. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో వస్తుంది - డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో. డీలక్స్ ధర రూ.2.26 లక్షలు, డీలక్స్ ప్రొ ధర రూ.2.29 లక్షలు. అయితే రూ. 50,000 తగ్గింపు ధర తర్వాత కొత్త హోండా CB300F ఇప్పుడు డీలక్స్ ధర రూ. 1.76 లక్షలకు, డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.79 లక్షలకు అందిస్తుంది.
undefined
కొత్త హోండా CB300F ఇప్పుడు KTM డ్యూక్ 125 అండ్ బజాజ్ డోమినార్ 250 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. 125 డ్యూక్ ధర రూ.1.78 లక్షలు, డామినార్ 250 ధర రూ.1.75 లక్షలు. 50,000 తగ్గింపు ఆఫర్ స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని హోండా తెలిపింది.
ఇంజిన్ పవర్
పవర్ ఫుల్ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ బైక్ కి 293cc ఆయిల్-కూల్డ్ 4-వాల్వ్ SOHC ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజన్ 7,500 rpm వద్ద 24 bhp శక్తిని, 5,500 rpm వద్ద 25.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్
హోండా CB300F బైక్ బరువు 153 కిలోలు, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 177 mm. 110/70 సెక్షన్ ఫ్రంట్ అండ్ 150//60 సెక్షన్ బ్యాక్ టైర్‌లతో 17-అంగుళాల వీల్స్ పై నడుస్తుంది. డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో 276mm ఫ్రంట్ డిస్క్, 220mm వెనుక డిస్క్‌లను పొందుతుంది. సస్పెన్షన్ సెటప్‌లో గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్ ఇంకా వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి.
ఫీచర్లు అండ్ కలర్ ఆప్షన్స్
కొత్త హోండా CB300F ఫుల్ LED హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, LED టెయిల్-లైట్లతో వస్తుంది. పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కొత్త హోండా CB300F మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది- మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అండ్ స్పోర్ట్స్ రెడ్.