భారతదేశంలోని 8 నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, హైదరాబాద్ ఇంకా కోల్‌కతాలో ఈ సర్వే నిర్వహించారు. ఈ నగరాలలో ఎక్కువ భాగం వారి రోజువారీ ప్రయాణ సమయంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు గుర్తింపు పొందాయి.
హైదరాబాద్, 23 మార్చి 2023: అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ఫలితాలకు సంబంధించి ఎంజి మోటార్ ఇండియా నివేదికను నేడు విడుదల చేసింది. నీల్సన్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాన భారతీయ నగరాల్లో నివసించే వ్యక్తుల మెబిలిటీ విధానాలు అలాగే, ప్రయాణాల్లో వారు ఎదుర్కొనే సవాళ్లపై విలువైన అభిప్రాయాలను సేకరించారు. సర్వే ఫలితాలు భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలోని మొబిలిటీ స్థితిని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఒక్కరికీ మెరుగైన పట్టణ మొబిలిటీ విధానాలను సరళం చేసేందుకు విధానాల రూపకర్తలతో సహా భాగస్వాములు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి.
భారతదేశంలోని 8 నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, హైదరాబాద్ ఇంకా కోల్‌కతాలో ఈ సర్వే నిర్వహించారు. ఈ నగరాలలో ఎక్కువ భాగం వారి రోజువారీ ప్రయాణ సమయంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు గుర్తింపు పొందాయి. సర్వేకు స్పందించిన వారిలో 18 నుంచి 37 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు, స్త్రీలు ఉండగా, వారి ఇంట్లో కనీసం ఒక కారు ఉంది.
undefined
సర్వేలో వెల్లడైన కీలక అంశాలు ఇలా ఉన్నాయి:
సాధారణ ఫలితాలు:
సమీక్షకు స్పందించిన వారిలో 74% మంది తగినంత పార్కింగ్ మౌలిక సదుపాయాలను సాధారణ సమస్యగా గుర్తించారు.
వాహన పార్కింగ్ అనేది భారతీయ నగరాల్లో కార్ల యజమానులు ఎదుర్కొనే సాధారణ సమస్య. సమీక్షకు స్పందించిన వారిలో కేవలం 26% మంది పార్కింగ్‌ను గుర్తించడం సులభం అని తెలుసుకోగా, 74% మంది వారి నగరాల్లో పార్కింగ్ స్థలాల అందుబాటు, నిర్వహణ సమస్యలతో పోరాడుతున్నారు. దాదాపు 64% మంది వ్యక్తులు పార్కింగ్ లేకపోవడం వల్ల కార్లను ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారని లేదా పార్కింగ్ లభ్యతకు అనుగుణంగా ప్లాన్‌లను సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
భారతదేశంలోని 71% కార్ల యజమానులు ఒక కొ-ప్రయాణికుడితో మాత్రమే ప్రయాణిస్తున్నారు
షేర్డ్ మొబిలిటీ అనేది భారతీయ నగరాల్లోని చాలా మంది కార్-యజమానులలో ఇప్పటికీ ప్రాచుర్యం లభించలేదు. సర్వేకు స్పందించిన 71% మంది తాము కారును ఒంటరిగా లేదా మరొక ప్రయాణికుడితో మాత్రమే కలిసి వెళుతుంటామని తెలిపారు.
సమీక్షకు స్పందించిన వారిలో కేవలం 1% మంది మాత్రమే ఎల్లప్పుడూ ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమీక్షకు స్పందించిన వారిలో 73% పట్టణ ప్రయాణికులు ప్రయాణానికి వ్యక్తిగత మొబిలిటీకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
సాధారణంగా నగరంలో ప్రయాణానికి కార్లు ఉపయోగించబడతాయి. సమీక్షకు స్పందించిన వారిలో 73% మంది రోజువారీ లేదా అప్పుడప్పుడు పని లేదా కళాశాలకు ప్రయాణించేందుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. అదనంగా, పట్టణాలలో కార్ల యజమానులు తరచుగా తమ కార్లను ఇంటి పనులు, షాపింగ్, సోషియల్ ఔటింగ్‌లు మరియు వారాంతపు ప్రయాణాలకు ఉపయోగిస్తారు. సర్వేలో పాల్గొన్నవారిలో 38% మంది కూడా అత్యవసర పరిస్థితుల కోసం తమ కార్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికీ పెట్రోల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని సమీక్షకు స్పందించిన వారు చెప్పడంతో పాటు వివిధ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో పెద్ద మార్పును గుర్తించారు.
శిలాజ ఇంధనాలకు సంబంధించిన పర్యావరణ సంరక్షణపై ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ, ప్రధాన భారతీయ నగరాల్లోని వ్యక్తులలో గణనీయమైన భాగం ఇప్పటికీ పెట్రోల్-ఆధారిత వాహనాలను ఇష్టపడుతున్నారు. సర్వే ప్రకారం, సమీక్షకు స్పందించిన 50% మంది పెట్రోల్ వాహనాలు కలిగి ఉండగా, 35% మంది డీజిల్ వాహనాలు కలిగి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రత్యామ్నాయ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీల వైపు మళ్లేందుకు కార్ల యజమానుల మధ్య మార్పు వృద్ధి కనిపిస్తోంది.
సమీక్షకు స్పందించిన వారిలో 81% మంది ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకెళ్లేందుకు లగేజీ స్థలాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు.
సమీక్షకు స్పందించిన వారిలో దాదాపు 77% మంది తమ కారు లగేజీ స్థలాన్ని ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో, 81% మంది ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని తీసుకు వెళ్లేందుకు లగేజీ స్థలాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఎక్కువ దూరాలు మరియు ప్రయాణ సమయాలు పట్టణ ప్రయాణాన్ని బాధాకరంగా చేస్తాయి
సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 71% మంది పని లేదా కళాశాలకు రోజువారీ ప్రయాణానికి 30 నిమిషాల నుంచి గంటకు పైగా వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. సమీక్షకు స్పందించిన వారిలో 61% మంది ఐదేళ్ల క్రితం నుంచి వారి సాధారణ ప్రయాణ సమయంతో పోలిస్తే పెరిగిన ప్రయాణ సమయం పెరిగిందని అంగీకరించారు.
ఇంధన ధరల పెంపు పట్టణ ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది.
ఇంధన ధరల పెరుగుదల దేశంలో సార్వత్రిక ప్రభావాన్ని చూపింది. పట్టణాలలో కార్ల యజమానులు కూడా దీనికి మినహాయింపు కాదు. దాదాపు 52% మంది ప్రజలు ఇంధన పెంపుదల తమపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. అలాగే, సమీక్షకు స్పందించిన వారిలో దాదాపు 50% మంది ప్రతి నెలా ఇంధనం కోసం నెలకు రూ.6,000 కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
నగరాల్లో వాయు, శబ్ద కాలుష్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
చాలా మంది నగరవాసులకు వాయు మరియు ధ్వని కాలుష్యం ఒక ప్రధాన ఆందోళన. ఇది యూఎంహెచ్‌ఐ (UMHI) పరిశోధనల ద్వారా పుష్కలంగా ప్రతిబింబిస్తుంది. సమీక్షకు స్పందించిన వారిలో 80% కన్నా ఎక్కువ మంది తమ నగరంలో గాలి కలుషితమైందని భావిస్తున్నారు. అదేవిధంగా, సర్వేలో పాల్గొన్న వారిలో సమాన నిష్పత్తిలో తమ పట్టణ ప్రాంతంలో శబ్ద కాలుష్యం ఉందని అంగీకారం తెలుపుతూ ధృవీకరించారు. దీనికి అదనంగా, సమీక్షకు స్పందించిన 69% మంది కారును కొనుగోలు చేసేటప్పుడు పర్యావరణాన్ని ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
అర్బన్ మొబిలిటీ సవాళ్లకు కాంపాక్ట్ స్మార్ట్ కార్లు సాధ్యమయ్యే పరిష్కారం
భారతదేశంలో పట్టణ మొబిలిటీ ఎదుర్కొంటున్న సమస్యలకు స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌లు చాలా కాలంగా సాధ్యమైన సమాధానాలుగా చెప్పబడుతున్నాయి. యుఎంహెచ్ఐ (UMHI) సర్వేలో దాదాపు 90% మంది ప్రజలు ఒక కాంపాక్ట్ స్మార్ట్ కారు నగరంలో తమ ప్రయాణ సమయాన్ని తగ్గించగలదని భావించారు. ప్రతిరోజూ వారి ప్రయాణంలో వారు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇవి పరిష్కరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
హ్యాపీనెస్ కోషెంట్‌ని అంచనా వేయడం
ప్రబలంగా ఉన్న శబ్ద, వాయు కాలుష్యాలతో పాటు దూరం మరియు ఆన్-రోడ్ రద్దీ కారణంగా సుదీర్ఘ ప్రయాణాలు అన్ని ప్రధాన భారతీయ నగరాల్లోని ప్రయాణికులలో ఆందోళనను ప్రేరేపిస్తాయి. సర్వేలో పాల్గొన్న 80% కన్నా ఎక్కువ మంది నగరంలో రోజువారీ ప్రయాణంలో ఆందోళనను అనుభవించినట్లు సర్వేలో తేటతెల్లమైంది. ఎంచుకున్న కొలమానాలపై సమీక్షకు స్పందించిన వారు అందించిన రేటింగ్‌ల ఆధారంగా, మొబిలిటీ కోసం నగరాల వారీగా సంతోషం స్కోర్‌ను కూడా సర్వే అంచనా వేసింది. కోల్‌కతా, పుణె, చెన్నైలు ఇండెక్స్‌లో మంచి స్కోర్‌ను సాధించగా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయి, హైదరాబాద్ మరియు ఢిల్లీ ఎన్‌సీఆర్ రేటింగ్‌లు వారి నగరాల్లో మొబిలిటీ స్థితికి సంబంధించి సమీక్షకు స్పందించిన వారి అసంతృప్తిని ప్రతిబింబించాయి.
సర్వే గురించి ఎంజి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ఫలితాలు భారతీయ వినియోగదారుల డ్రైవింగ్ ప్రవర్తన, మొబిలిటీ సొల్యూషన్‌ల కోసం వారి ప్రాధాన్యతలపై మాకు విలువైన సమాచారం అందింది. కార్ల యజమానులు తమ వాహనాల పనితీరు మరియు ఫీచర్లతో పాటు సౌలభ్యం, భద్రత మరియు మొత్తం డ్రైవింగ్ అనుభవానికి కూడా ప్రాధాన్యత ఇస్తారని సర్వే స్పష్టంగా తేటతెల్లం చేసింది. అత్యాధునిక మొబిలిటీ సొల్యూషన్‌లను అందించేందుకు నడిచే బ్రాండ్‌గా, మా వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండవలసిన ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము’’ అని వివరించారు.