కొత్త కారు ట్రబులిచ్చింది.. కోర్టుకెక్కిన కస్టమర్.. నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆర్డర్

By Ashok Kumar  |  First Published Jul 17, 2024, 3:36 PM IST

నాసిరకం కారును ఇచ్చిన బీఎండబ్ల్యూ డీలర్‌పై కోర్టుకెక్కిన కస్టమర్ పోరాటానికి ఫలితం దక్కింది. ఇప్పుడు కస్టమరుకి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


లగ్జరీ, ఖరీదైన కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీ ముందు వరుసలో ఉంటుది. ఇండియాలో కూడా బీఎమ్‌డబ్ల్యూ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఓ  లగ్జరీ కారును కొన్న కస్టమర్ తనకు సరిగ్గా పనిచేయని కారును ఇచ్చినందుకు BMWపై కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తర్వాత ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఇప్పుడు కస్టమర్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

సెప్టెంబర్ 25, 2009న ఓ హైదరాబాద్ కస్టమర్  BMW 7 సిరీస్ కార్ కొన్నారు. 4 రోజుల తర్వాత ఓనరుకి కారు నడుపుతుండగా కారులో కొన్ని తీవ్రమైన సమస్యలు కనిపించాయి. ఆ సమయంలో కారు సర్వీస్ సిబ్బంది కారును చెక్ చేశారు. తరువాత నవంబర్ 13, 2009న అదే సమస్య మళ్లీ ఎదురైంది. దీంతో తనకు నాసిరకం కారు ఇచ్చారని మనస్తాపం చెందారు కస్టమర్.

Latest Videos

undefined

చివరికి నవంబర్ 16, 2009న కార్ ఓనర్  BMWపై ఫిర్యాదు చేయాగా..  2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బీఎండబ్ల్యూపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేసింది. ఇది మాత్రమే కాదు.. నాసిరకం కారు ఇచ్చినందున కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనికి బీఎమ్‌డబ్ల్యూ డీలర్ కూడా అంగీకరించాడు. అయితే హైకోర్టు ఆదేశాలను అంగీకరించేందుకు కస్టమర్ ఒప్పుకోలేదు. ఆ విధంగా BMW కార్ డీలర్‌కి అతని లాయర్ ద్వారా నోటీసు అందింది. కస్టమర్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ కారు  కొనేటప్పుడు ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరారు. 

దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇప్పుడు కస్టమర్ కి అనుకూలంగా తీర్పునిస్తూ రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

click me!