ఇలాంటి కారుని టీవీలో కూడా చూసి ఉండరు.. దీని ధర అక్షరాలా 20.91 కోట్లు!

By Ashok kumar Sandra  |  First Published Apr 18, 2024, 12:29 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్యూర్ వైట్ గోల్డ్ బెంజ్ కారు ఓ ఆయిల్ వ్యాపారికి చెందినది. అయితే ఈ కారు ఇప్పుడు పెను సంచలనం సృష్టించింది. ఎందుకంటే దీని లుక్, ధర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
 


దుబాయ్ వ్యాపారులు అత్యంత కాస్ట్లీ లగ్జరీ కార్లను  కొనడం కొత్తేమీ కాదు. రోల్స్ రాయిస్, బుగాటీ, బెంట్లీ సహా కోట్లాది రూపాయల కార్లను కొంటుంటారు.అలాగే కొంతమంది వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తారు ఇంకా వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తారు.సాధారణంగా  గోల్డ్ కోటెడ్ కార్లు వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ ఓ దుబాయ్ బిలియనీర్ మాత్రం మెర్సిడెస్ బీజ్ కారును పూర్తిగా తెల్లని బంగారంతో కస్టమైజ్ చేశాడు. ఈ వైట్ గోల్డ్ బెంజ్ కారు ధర అక్షరాలా రూ.20.91 కోట్లు.

ఈ కారును దుబాయ్ ఆయిల్ వ్యాపారి కస్టమైజ్ చేశారు. ఈ కారు బయటి  భాగం 18k స్వచ్ఛమైన తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఈ కారుకు రక్షణగా ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించారు. ఈ కారు  స్వచ్ఛమైన తెల్లని బంగారు కారు కాబట్టి, కారు నుండి చిన్న ముక్క చోరీకి గురైనా భారీ నష్టం వాటిల్లుతుంది. 

Latest Videos

undefined

ఈ వ్యాపారవేత్త షాపింగ్‌తో సహా ఈ కారులో ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీ గార్డుని  మరో కారులో తీసుకెళ్లేవాడు. అతని భద్రత కోసం ఇతర సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కారుకు కాపలాగా మరో ఫోర్స్ సెక్యూరిటీ గార్డులను నియమించారు.

ఈ కారు ఇప్పటికే దుబాయ్‌లో సంచలనం సృష్టించింది. ఆయిల్  పరిశ్రమ కారణంగా దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  ప్రపంచంలోనే ధనిక దేశాలు. ఇక్కడ ఆయిల్ పరిశ్రమను నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలు కూడా కోటీశ్వరులే. అందువల్ల, ఈ వ్యాపారవేత్తలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడమే కాకుండా, కార్లను మోడిఫై చేయడానికి  కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు.

ఈ కారు మెర్సిడెస్ బెంజ్ వి10 క్వాడ్ టర్బో ఇంజన్ కారు. 1,600 హెచ్‌పి పవర్,  2800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ కారులో మరింత శక్తివంతమైన ఇంజన్‌ని ఉపయోగించారు. అయితే  0-100 కి.మీ స్పీడ్  కేవలం 2 సెకన్లలోనే అందుకోగలదు.

click me!