ఇండియాలో టెస్లా కార్లకు గ్రీన్ సిగ్నల్..? ప్రధానిని కలవనున్న ఎలోన్ మస్క్..

By Ashok kumar SandraFirst Published Apr 11, 2024, 9:44 AM IST
Highlights

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడినించారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 
 

బిలియనీర్ అండ్ టెస్లా   సీఈఓ  ఎలోన్ మస్క్ X (గతంలో ట్విట్టర్)లో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు  ఎదురుచూస్తున్నట్లు   తాన భారత పర్యటనను వెల్లడించారు. ఎలోన్ మస్క్ ఇండియా టూర్  ప్రకటన భారత్లో పెట్టుబడి ప్రణాళికలు, కొత్త ఫ్యాక్టరీ స్థాపన వంటి ఊహాగానాల నివేదికల నేపథ్యంలో  వచ్చింది.

ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యాన్ని గతంలో వ్యక్తీకరించిన ఎలోన్ మస్క్ ఈ పర్యటనలో కంపెనీకి చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి రానున్నట్లు  భావిస్తున్నారు. సరైన వివరాలు వెల్లడించనప్పటికీ, ఈ సమావేశం ఏప్రిల్ చివరి వారంలో జరగాల్సి ఉంది.

ఎలోన్ మస్క్   గత సంవత్సరం జూన్‌లో యుఎస్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు, అక్కడ అతను 2024లో భారతదేశాన్ని సందర్శించే ప్రణాళికలు, భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ గురించి చర్చించారు. దేశంలో తయారీ యూనిట్లను నెలకొల్పడంలో కనీసం USD 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించే కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎలోన్ మస్క్ చర్చ  జరిగింది.

టెస్లా కంపెనీ కార్లను దిగుమతి చేసుకునేందుకు సుంకాన్ని తగ్గించాలని కోరుతూ గత ఏడాది భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. 2022లో టెస్లా   కార్లను దేశంలో విక్రయించడానికి,  సర్వీస్ చేయడానికి అనుమతించకపోతే భారతదేశంలో తయారీని ప్రారంభించదని ఎలోన్ మస్క్ ప్రకటించారు. అంతకు ముందు సంవత్సరంలో టెస్లా   దిగుమతి చేసుకున్న వాహనాల సక్సెస్  బట్టి భారతదేశంలో ఒక తయారీ యూనిట్‌ను స్థాపించవచ్చని సూచించాడు.  

Elon Musk లేటెస్ట్ కామెంట్స్ 

నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ CEO నికోలై టాంగెన్‌తో X (గతంలో ట్విట్టర్)లో ఇటీవల జరిగిన చర్చలో, ఎలాన్ మస్క్ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశ   స్టేటస్  ఎలోన్ మస్క్ హైలైట్ చేసారు ఇంకా  భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) అందుబాటులోకి తీసుకురావడం  ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఇది ఇతర దేశాలలోని ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది. "భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రతి ఇతర దేశంలో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లే భారతదేశం కూడా ఎలక్ట్రిక్ కార్లు  ఉండాలి. భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం సహజమైన పురోగతి" అని మస్క్ పేర్కొన్నారు. 

 

Looking forward to meeting with Prime Minister in India!

— Elon Musk (@elonmusk)
click me!