10 గేర్లు, ఇండియాలోకి ఫోర్డ్ కొత్త కార్.. ఫార్చ్యూనర్‌కు పోటీగా వచ్చేస్తోంది...

By Ashok kumar SandraFirst Published Apr 10, 2024, 7:26 PM IST
Highlights

పాత మోడల్‌తో పోలిస్తే, 2024 ఫోర్డ్ ఎండీవర్ కొత్త సేఫ్టీ ఫీచర్లను చేర్చడంతో పాటు లోపల ఇంకా  బయట అనేక మార్పులతో వస్తుంది.
 

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ కొత్త  ఎండీవర్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడంతో భారత్‌లోకి తిరిగి ప్రవేశించినట్లు సమాచారం . పాత మోడల్‌తో పోలిస్తే, 2024 ఫోర్డ్ ఎండీవర్ కొత్త సేఫ్టీ ఫీచర్లను చేర్చడంతో పాటు లోపల ఇంకా  బయట  ఎన్నో  మార్పులతో వస్తుంది.

కొత్త ఫోర్డ్ ఎండీవర్ రేంజర్ పికప్ ప్లాట్‌ఫారమ్ (లాడర్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్)పై కొనసాగుతుంది. ఈ SUV DRLలతో కొత్త మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్‌లు ఇంకా ఇన్‌వర్టెడ్ L-ఆకారపు LED టెయిల్ లైట్‌లను పొందుతుంది.

ఫోర్డ్ ఎండీవర్‌ను మొదట్లో నేరుగా దిగుమతి చేసుకోనున్నట్లు ఫోర్డ్ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కంపెనీ తర్వాత ఎండీవర్‌ను చెన్నై ఫెసిలిటీలో అసెంబుల్ చేస్తుంది. కొత్త జనరేషన్ ఎండీవర్ కొత్త తరం SUVతో కొన్ని అండర్‌పిన్నింగ్‌లను షేర్ చేసుకుంటుంది. కొత్త ఫోర్డ్ ఎండీవర్ ని ఫోర్డ్ ఎవరెస్ట్ అని కూడా పిలుస్తారు, కొన్ని మార్కెట్లలో   డీజిల్ ఇంజన్‌లో రెండు అప్షన్స్   ఉంటాయి.

2024 ఫోర్డ్ ఎండీవర్ 2.0-లీటర్ టర్బో-డీజిల్ లేదా 3.0-లీటర్ V6 టర్బో-డీజిల్‌  పొందవచ్చు. 2.0-లీటర్ ఇంజన్ సింగిల్-టర్బో లేదా ట్విన్-టర్బో వెర్షన్‌లలో ఉంటుంది, అయితే 3.0-లీటర్ V6 టర్బో డీజిల్ ఇంజన్ కొత్త రేంజర్ లాగానే  ఉంటుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, ఈ SUV 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 10-స్పీడ్ ఆటోమేటిక్‌తో ఉంటుంది. ఫోర్డ్ ఎండీవర్ 2WD ఇంకా  4WD రెండింటిలోనూ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

2024 ఫోర్డ్ ఎండీవర్ టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా ఉంటుంది. ఈ కొత్త జనరేషన్  బేస్ వేరియంట్ ధర రూ. 29.8 లక్షల నుండి రూ. 38 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

click me!