టాటా పంచ్ ఎలక్ట్రిక్ మోడల్‌పై కంపెనీ రూ.30,000 తగ్గింపును అందిస్తోంది. పంచ్ EVలో మొత్తం 20 వేరియంట్‌లు ఉన్నాయి. ఏదైనా ఒక వేరియంట్‌పై ఖచ్చితంగా కనీసం రూ. 10,000 డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది.
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ జులై నెలలో దాదాపు అన్ని మోడల్ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో కొత్తగా లాంచ్ చేసిన టాటా పంచ్ EV కూడా ఉంది. మరోవైపు పంచ్ ఈవీకి కస్టమర్ల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. గత నెల అంటే జూన్లో టాటా పంచ్ దేశంలోనే నంబర్ 1 కారుగా నిలిచింది. దీంతో మారుతి స్విఫ్ట్ వెనుకబడిపోయింది. ఈ నెలలో పంచ్ ఎలక్ట్రిక్ మోడల్‌పై కంపెనీ రూ. 30,000 డిస్కౌంట్ అందిస్తోంది. పంచ్ EVలో మొత్తం 20 వేరియంట్‌లు ఉన్నాయి. ఏదైనా మోడల్ పై కనీసం రూ. 10,000 డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటుంది తెలిపింది.
టాటా పంచ్ EV డిజైన్ ఎలెమెంట్స్ Nexon EV నుండి తీసుకుంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లాగే బంపర్, గ్రిల్ డిజైన్- LED లైట్ బార్, దీని ఫ్రంట్ బంపర్‌లో ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ LED హెడ్‌లైట్లు, వర్టికల్ స్ట్రీక్స్‌తో రీడిజైన్ చేసిన లోయర్ బంపర్ & సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. వెనుక భాగంలో Y- ఆకారపు బ్రేక్ లైట్లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, డిజైన్ బంపర్, సైడ్ ప్రొఫైల్‌లో ఇప్పుడు 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇంకా అన్ని వీల్స్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.
undefined
టాటా పంచ్ EVని రెండు బ్యాటరీ ప్యాక్ అప్షన్స్ లో కొనవచ్చు. వీటిలో 25 kWh & 35 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇందులో 7.2 kW ఫాస్ట్ హోమ్ ఛార్జర్ (LR వేరియంట్ కోసం), 3.3 kW వాల్‌బాక్స్ ఛార్జర్ ఉంటుంది. 25 kWh బ్యాటరీ ప్యాక్ సర్టిఫైడ్ రేంజ్ 421 కి.మీ. అలాగే 35 kWh బ్యాటరీ ప్యాక్ సర్టిఫైడ్ రేంజ్ 315 కి.మీ. ఇందులో బానెట్ కింద 14-లీటర్ ఫ్రాంక్ (ఫ్రంట్ ట్రంక్) ఉంటుంది. పంచ్ EVలో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, ప్రీమియం ఫినిషింగ్‌తో లేటెస్ట్ సీట్ అప్హోల్స్టరీ, టాటా లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఈ EVని ఏదైనా 50Kw DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 56 నిమిషాల్లో 10 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనికి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వారంటీతో వాటర్ ప్రూఫ్ బ్యాటరీ లభిస్తుంది. ఇంకా 5 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.
BNCAP టెస్టులో అడల్ట్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (AOP) కోసం పంచ్ EV 32కి 31.46 పాయింట్లను, ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకి 14.26 ,సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 15.6 స్కోర్ చేసింది. చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (COP)కి కూడా 49కి 45 పాయింట్లు వచ్చాయి. డైనమిక్ టెస్టింగ్‌లో 24 పాయింట్లకు 23.95, CRS (చైల్డ్ సీట్ రెస్ట్రెయింట్) విభాగంలో 12కి 12 పాయింట్లు సాధించింది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, Isofix చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా వస్తాయి.
note : పైన పేర్కొన్న డిస్కౌంట్స్ దేశం నుండి దేశం, నగరం నుండి నగరం, డీలర్‌షిప్‌లు, స్టాక్, కలర్ అండ్ వేరియంట్‌లను బట్టి మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్స్ కోసం ఇంకా ఇతర సమాచారం కోసం మీ స్థానిక డీలర్‌ను సంప్రదించండి.