25 కి.మీ మైలేజీ, ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు! హోండా అద్భుతమైన కారు

By Ashok KumarFirst Published Jul 2, 2024, 9:25 AM IST
Highlights

ఎమ్‌పివి సెగ్మెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కంపెనీ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విదేశాలలో MPV విభాగంలో కూడా హోండా బలంగా ఉంది. కంపెనీ తాజగా జపాన్‌లో కొత్త హోండా ఫ్రీడ్ ఎమ్‌పివిని లాంచ్ చేసింది. దీని ధర 2.508 మిలియన్ యెన్ (సుమారు రూ. 13 లక్షలు) నుండి  3.437 మిలియన్ యెన్ (సుమారు రూ. 17 లక్షలు) మధ్య ఉంది.
 

జపనీస్ ఆటో బ్రాండ్ హోండా నుండి ఎలివేట్ ఎస్‌యూవీకి దేశంతో పాటు విదేశాలలో మంచి స్పందన లభిస్తోంది. కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ కారు కూడా ఇదే. కంపెనీ దృష్టి మొత్తం ఇప్పుడు SUV విభాగాన్ని బలోపేతం చేయడంపై పెట్టింది. ఇదిలా ఉంటే, MPV విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. విదేశాల్లో MPV విభాగంలో కూడా హోండా బలంగా ఉంది. కంపెనీ తాజాగా జపాన్‌లో కొత్త హోండా ఫ్రీడ్ ఎమ్‌పివిని లాంచ్ చేసింది. దీని ధర 2.508 మిలియన్ యెన్ (సుమారు రూ. 13 లక్షలు) నుండి  3.437 మిలియన్ యెన్ (సుమారు రూ. 17 లక్షలు) మధ్య ఉంది.

2024 హోండా ఫ్రీడ్ ను రెండు పవర్‌ట్రెయిన్‌లలో విడుదల చేసింది. ఈ మోడల్‌లు 1.5L NA పెట్రోల్ & 1.5L పెట్రోల్‌తో e:HEV డ్యూయల్-మోటార్ సిస్టమ్. 6,600 rpm వద్ద 118 PS, 4,300 rpm వద్ద 142 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో అందిస్తున్నారు. హోండా ఫ్రీడ్ MPV 4,310 mm పొడవు, 1,720 mm వెడల్పు, 1,780 mm ఎత్తు, 2,740 mm వీల్‌బేస్‌తో వస్తుంది.

Latest Videos

హోండా e:HEV అనేది 106 PS, 127 Nm పవర్ ఉత్పత్తి చేసే 1.5L NA ఫోర్-పాట్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్. 48-Ah Li-Iron బ్యాటరీని 123 PS, 253 Nm ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి హైబ్రిడ్ సిస్టమ్‌ను రూపొందించింది.  

హోండా కంపెనీ హైబ్రిడ్ వేరియంట్‌ 25 kmpl, సాధారణ NA పెట్రోల్‌కు 16.2 kmpl మైలేజీని ప్రకటించింది. 

ఫ్రీడ్ ఎయిర్ 6 & 7 సీట్ల లేఅవుట్‌లలో లభిస్తుంది. క్రాస్‌స్టార్ 5 & 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. MPV AEB (అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్), ACC (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్), LKA (లేన్ కీప్ అసిస్ట్) వంటి హోండా సెన్సింగ్ సూట్‌తో స్టాండర్డ్ గా వస్తుంది. ఈ కారు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చుట్టూ ఫాబ్రిక్ ట్రిమ్ & రీపోజిషన్డ్ AC వెంట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారులో శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక వేరియంట్ కూడా ఉంటుంది, ఇందులో వీల్‌చైర్‌ల కోసం ర్యాంప్, పివోటెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీటు ఉన్నాయి.

హోండా కార్ ఇండియా ఈ కారును భారత మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడ లాంచ్ అయితే, కొత్త హోండా ఫ్రీడ్ మారుతి సుజుకి ఎర్టిగా, XL6, కియా కారెన్స్ అలాగే  మహీంద్రా మరాజో వంటి వాటితో పోటీపడనుంది. 

click me!