డ్రైవర్ సీటులో పుతిన్, తోడుగా ప్రధాని మోడీ! ఇది ఏ కారు? ఆలోచనలో కార్ల కంపెనీ..!

By Ashok Kumar  |  First Published Jul 10, 2024, 5:03 PM IST

మోదీతో కలిసి పుతిన్ ప్రయాణించిన వాహనం ఇప్పుడు ఆటోమోటివ్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు  ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తున్న వీడియో ఫుటేజీ తాజాగా వైరల్‌గా మారింది.
 


భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం రష్యా చేరుకున్నారు. మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కోలో సమావేశమయ్యారు. అయితే పుతిన్, రష్యా మోదీకి ఘన స్వాగతం పలికినట్లు సమాచారం. 

వ్లాదిమిర్ పుతిన్ ప్రధానిని తన ఇంటికి కూడా ఆహ్వానించారు. కాగా పుతిన్ తన ఎలక్ట్రిక్ కారులో నరేంద్ర మోదీని రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. రాష్ట్రపతి భవన్‌లోనే ఈ ఇద్దరు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.  

Latest Videos

undefined

పుతిన్ నివాసమైన నోవో ఒగోరియోవోలో మోదీతో కలిసి పుతిన్ ప్రయాణించిన వాహనం ఇప్పుడు ఆటోమోటివ్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.  పెద్ద టైర్లు, భారీ ఫ్రేమ్‌తో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గోల్ఫ్ కార్ట్‌తో సమానమైన ఈ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తున్న వీడియో ఫుటేజీ వైరల్‌గా మారింది. నాలుగు సీట్ల ఈ ఎలక్ట్రిక్ కార్ట్‌లో రెండు ముందు వైపు సీట్లు, రెండు వెనుక వైపు  సీట్లు ఉన్నాయి.

దీనిని గోల్ఫ్ కార్ట్ లేదా గోల్ఫ్ బగ్గీ లేదా గోల్ఫ్ కార్ అని కూడా పిలుస్తారు, ఈ చిన్న కారు ఒక చిన్న మోటరైజ్డ్ వాహనం. అయితే మోదీతో కలిసి పుతిన్‌ నడిపిన ఈ ఎలక్ట్రిక్‌ కారు ఏ మోడల్‌, ఏ కంపెనీ అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రపంచ నాయకులిద్దరూ దృష్టి సారించే పర్యావరణ అనుకూలమైన క్లీన్ మొబిలిటీ సొల్యూషన్‌లను నొక్కి చెప్పగలదు. 

 భారతదేశం, రష్యా ఆటోమొబైల్ ప్రపంచం వారిద్దరి కదలికలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అనేక మల్టి నేషనల్  బ్రాండ్లు ఆ దేశం విడిచిపెట్టినప్పుడు రష్యన్ ఆటో పరిశ్రమకి ఎదురుదెబ్బ తగిలింది. కానీ లోకల్  & చైనీస్ బ్రాండ్‌లు రష్యన్ మార్కెట్‌లో ఉనికిని పెంచుకుంటున్నాయి, 2024 నాటికి ఆదాయం US$46.5 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ పరిస్థితిలలో పుతిన్, మోదీ భేటీలో ఆటోమొబైల్ ప్రపంచంలో ఏమైనా కదలిక వస్తుందేమో చూడాలి. 

71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్‌కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎంతో మంది జాతీయ నాయకులు, రాజకీయ నాయకులతో కలిసి ఆయన చాలాసార్లు కారులో ప్రయాణించారు. ఇటీవల, ఉత్తర కొరియా రూలర్  కిమ్ జోంగ్-ఉన్ రష్యాను సందర్శించినప్పుడు, పుతిన్ తన అధికారిక కారులో కిమ్‌తో కలిసి వచ్చారు. కిమ్ జోంగ్ ఉన్ కో-డ్రైవింగ్ సీట్లో కూర్చొని పుతిన్ కారు నడుపుతున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అంతేకాదు, కిమ్ జోంగ్‌కు రష్యాకు చెందిన ఔరస్(Aurus Senat) అనే లగ్జరీ కారును పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కార్ ఫుల్ సైజ్ లగ్జరీ సెడాన్ కారు. పుతిన్ కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

click me!