ఆగస్టులో లాంచ్ కానున్న కార్స్ ఇవే.. టాటా నుండి బెంజ్ వరకు లిస్ట్ ఇదిగో..

By Ashok Kumar  |  First Published Jul 30, 2024, 6:56 PM IST

మాస్-మార్కెట్ ఆటోమొబైల్స్ నుండి ప్రీమియం పర్ఫార్మెన్స్  SUVల వరకు మార్కెట్ ఎన్నో గొప్ప లాంచ్ లను  చూసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్ లాంచ్‌లు, ఆవిష్కరణలు ఆగస్టు నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. 


ఇండియాలోని కార్ల లవర్స్ కి వచ్చే నెల సంతోషకరమైన నెల. ఎందుకంటే ఆగస్టులో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కొన్ని గొప్ప లాంచ్‌లు జరగనున్నాయి. మాస్-మార్కెట్ ఆటోమొబైల్స్ నుండి ప్రీమియం పర్ఫార్మెన్స్  SUVల వరకు మార్కెట్ ఎన్నో గొప్ప లాంచ్ లను  చూసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్ లాంచ్‌లు, ఆవిష్కరణలు ఆగస్టు నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. అయితే  ఎక్కువగా ఎదురుచూస్తున్న కొన్ని కార్ల లాంచ్‌ వివరాలు ఇదిగో... 

టాటా కర్వ్
టాటా ఫ్యాన్స్  అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆగస్టు లాంచ్‌లలో టాటా కర్వ్ ఒకటి . Nexon ఇంజిన్ ఈ కూపే-స్టయిల్ SUVకి అందించవచ్చని  భావిస్తున్నారు. ఈ కార్ ఎలక్ట్రిక్ మోడల్ లో కూడా విడుదల కానుంది. ఫిబ్రవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించారు.  పంచ్ EV  పవర్‌ట్రెయిన్‌  ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్ ఆగస్టు 7న ఇండియాలో విడుదల కానుంది.
 
సిట్రోయెన్ బసాల్ట్
ఫ్రెంచ్ కార్‌మేకర్ కూపే SUV సిట్రోయెన్ బసాల్ట్ ఆగస్టులో లాంచ్ కానుంది. C3 ఎయిర్‌క్రాస్ పవర్‌ప్లాంట్‌ పై ఉంటుందని  భావిస్తున్నారు. ఈ కార్ రాబోయే టాటా కర్వ్‌తో పోటీపడుతుంది. ఈ SUV  స్పెసిఫికేషన్‌లు సిట్రోయెన్ కారుతో సమానంగా ఉంటాయి.

Latest Videos

undefined

లంబోర్ఘిని ఉరుస్ SE
వోక్స్‌వ్యాగన్ ఆటోగ్రూప్ అనుబంధ సంస్థ లంబోర్ఘిని ఫేస్‌లిఫ్టెడ్ ఉరస్ SEని లాంచ్ చేయనుంది. అప్‌డేట్ చేయబడిన హెడ్‌ల్యాంప్,    మరింత శక్తివంతమైన ఇంజన్‌  ఉన్న ఈ SUV ఆగస్ట్ 8న భారతదేశానికి పరిచయం అవుతుంది. ఈ SUV ఆటో ఔత్సాహికులు,  వ్యాపారవేత్తల మధ్య ఒక పాపులర్   అప్షన్ గా మారడం ద్వారా స్పోర్ట్స్ కార్ల తయారీకి సహాయపడింది.

Mercedes-Benz GLC 43 AMG 
మెర్సిడెస్-బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో ఫేస్‌లిఫ్టెడ్ GLC AMG మోడల్ అండ్  కన్వర్టిబుల్ E-క్లాస్ సెడాన్‌లను విడుదల చేయనుంది. GLC ఇంజిన్ ఆరు నుండి నాలుగు సిలిండర్లకు తగ్గించబడుతుందని భావిస్తున్నారు. సాధారణ E-క్లాస్ CLE క్యాబ్రియోలెట్ లాగానే ఆరు-సిలిండర్ ఇంజన్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఈ లాంచ్‌లతో కలిపి 2024 నాటికి మొత్తం 12 వాహనాలను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. నివేదికల ప్రకారం, దీని తర్వాత దేశంలో మరో నాలుగు మెరుగైన మోడళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. 

మహీంద్రా ఫైవ్-డోర్ థార్
కొన్ని మీడియా నివేదికల ప్రకారం, భారతదేశపు ప్రముఖ SUV తయారీ సంస్థ మహీంద్రా 5 డోర్ల థార్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫైవ్ డోర్ థార్ వచ్చే అవకాశం ఉంది.

click me!