క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.10 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణించొచ్చు...

By asianet news telugu  |  First Published Dec 6, 2022, 3:28 PM IST

కొత్త కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అల్ట్రా-మోడ్రన్ హీట్ ప్రూఫ్ లిథియం అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీని ఉపయోగించినట్లు కంపెనీ మీడియా నోట్‌లో తెలిపింది.


ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కొమాక్ ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి ఫ్లోరాను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్కూటర్ ని ఈ విభాగంలో బడ్జెట్ ధరతో ప్రవేశపెట్టారు, అందుకే ఈ స్కూటర్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారింది. కొత్త బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర  రూ.78,999. హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 8వ ఎడిషన్ అని కంపెనీ తెలిపింది.  

కొత్త కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అల్ట్రా-మోడ్రన్ హీట్ ప్రూఫ్ లిథియం అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీని ఉపయోగించినట్లు కంపెనీ మీడియా నోట్‌లో తెలిపింది. వాహనదారుడు స్కూటర్ నుండి బ్యాటరీ ప్యాక్‌ను సులభంగా తీసి  మళ్లీ అటాచ్ చేయవచ్చు. LPF బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా స్కూటర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. 

Latest Videos

undefined

రేంజ్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్
కొత్త స్కూటర్ 100 కి.మీ వరకు ఫుల్ ఛార్జ్ తో వస్తుందని క్లెయిమ్ చేయబడింది. క్రూయిజ్ మోడ్‌లో 80 కి.మీ పరిధిని అందిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. 100 కిలోమీటర్లు నడపడానికి బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి దాదాపు 2 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. విద్యుత్తు రేటు యూనిట్‌కు రూ. 5గా చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 10 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణిస్తుంది.  

ఫీచర్స్ అండ్ కలర్స్ 
 కొత్త మోడల్‌లోని ఇతర ముఖ్య ఫీచర్లు చూస్తే సెల్ఫ్ డయాగ్నస్టిక్ మీటర్, అదనపు బ్యాక్‌రెస్ట్‌తో  సౌకర్యవంతమైన సీటు, పార్కింగ్ అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, బూట్ స్పేస్, అదనపు సెక్యూరిటి కోసం 270x35mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్  బ్రేక్‌ ఇచ్చారు. కొత్త ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే, శాక్రమెంటో గ్రీన్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు.

ఫైర్ సేఫ్ 
కంపెనీ ఒక ప్రకటనలో "ఐరన్-రిచ్ సెల్స్ అండ్ హై ఫైర్ రిసిస్టంట్ కారణంగా, LiFePO4 బ్యాటరీలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా  సురక్షితంగా ఉంటాయి.  

కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, “రైడర్‌లకు సౌకర్యవంతమైన, తక్కువ మెయింటెనెన్స్ ఇంకా లాంగ్ లైఫ్ అందించే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం ద్వారా కోమాకి ఇప్పటికే బలమైన మార్కెట్ ఉనికిని నెలకొల్పింది. మా కొత్త అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లోరా క్లీన్ మొబిలిటీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది" అని అన్నారు.

click me!