2022 జీప్ మెరిడియన్ ఎస్‌యూవి ప్రపంచ మార్కెట్లలో కమాండర్ పేరుతో కూడా విక్రయించనుంది. ఈ ఎస్‌యూవి కంపాస్ ట్రయిల్ హాక్ తర్వాత కార్ల తయారీ సంస్థ రెండవ అతిపెద్ద లాంచ్ అవుతుంది.
అమెరికాకు చెందిన పాపులర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) తయారీ సంస్థ జీప్ (jeep) భారత మార్కెట్ కోసం కొత్త మూడు-వరుసల 7-సీట్ల ఎస్‌యూవి మెరిడియన్ (Meridian) ను విడుదల చేసింది. 2022 జీప్ మెరిడియన్ ఎస్‌యూవి ప్రపంచ మార్కెట్లలో కమాండర్ పేరుతో కూడా విక్రయించనుంది. ఈ ఎస్‌యూవి కంపాస్ ట్రయిల్ హాక్ తర్వాత కార్ల తయారీ సంస్థ రెండవ అతిపెద్ద లాంచ్ అవుతుంది. జీప్ 2022 మెరిడియన్ ఎస్‌యూవిని స్థానికంగా రంజన్‌గావ్ తయారీ ప్లాంట్‌లో తయారు చేస్తుంది. జీప్ భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఎస్‌యూవిని జపాన్, ఆస్ట్రేలియాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతాలకి ఎగుమతి చేస్తుంది.
బుకింగ్‌లు ఎప్పుడంటే
కొత్త 2022 జీప్ మెరిడియన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో జీప్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ఎస్‌యూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. కంపెనీ మే నుండి కొత్త 2022 జీప్ మెరిడియన్ బుకింగులను ప్రారంభించవచ్చు. భారత మార్కెట్లో విడుదల చేసినప్పుడు 2022 మెరిడియన్ ఎస్‌యూవి టయోటా ఫార్చ్యూనర్ (toyota fortuner), ఎంజి గ్లోస్టర్ (MG GLOSTER) వంటి కార్లతో పోటీపడుతుంది.
undefined
ఇంజిన్ అండ్ స్పీడ్
కొత్త 2022 జీప్ మెరిడియన్ SUV 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందిస్తున్నారు. ఈ SUV ఫ్రంట్-వీల్ డ్రైవ్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. అలాగే, మెరిడియన్ మూడు డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది - snow, sand/ mud అండ్ auto. ఈ SUV కేవలం 10.8 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు, దీని టాప్ స్పీడ్ 198 kmph.
గ్రేట్ లుక్ అండ్ డిజైన్
లుక్ అండ్ డిజైన్ విషయానికి వస్తే జీప్ మెరిడియన్ SUV కార్ తయారీ సంస్థ సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజ్ పొంద్తుంది. దీనితో పాటు జీప్ కంపాస్ అండ్ గ్రాండ్ చెరోకీ SUV ఎఫ్ఫెక్ట్స్ ఇందులో కనిపిస్తాయి. ముందు భాగంలో, మెరిడియన్ బై-ఫంక్షన్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయమైన బంపర్, LED ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌ను పొందుతుంది.
ఎస్‌యూవి సైడ్ వైపు చూస్తే బాడీ క్లాడింగ్, పనోరమిక్ సన్‌రూఫ్‌కు ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ రూఫ్ రెయిల్ పొందుతుంది. దీనికి జీప్ కంపాస్ కంటే పెద్ద బ్యాక్ ఓవర్‌హ్యాండ్ అండ్ పెద్ద బ్యాక్ డోర్స్ పొందుతుంది. వెనుక వైపున, SUV హారిజంటల్ LED టెయిల్‌లైట్‌లు, వెనుక వైపర్ అండ్ వాషర్ ఇంకా ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్‌ను పొందుతుంది. ఈ SUVకి 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
ఫీచర్లు
2022 మెరిడియన్ SUV ఇంటీరియర్ గురించి మాట్లాడితే జిప్ కంపాస్ లోపల కూడా ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో జీప్ U-కనెక్ట్‌తో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ Apple CarPlay అండ్ Android Autoతో వస్తుంది. ఎస్‌యూవిలో వైర్‌లెస్ ఛార్జింగ్, 8-వే ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ సీట్లు, 360-వ్యూ కెమెరా, 9-స్పీకర్ ఆల్పైన్ హై-డెఫినిషన్ మ్యూజిక్ సిస్టమ్‌తో సహా ఎన్నో ఫీచర్స్ పొందుతుంది.
సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడుతూ, జీప్ మెరిడియన్ 60 కంటే ఎక్కువ సేఫ్టీ అండ్ సెక్యూరిటి ఫీచర్స్ అందిస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESC, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి.
మెరిడియన్ SUV మూడు వరుసలలో ప్రయాణించే వారికి అత్యుత్తమ-క్లాస్ అనుభవాన్ని అందిస్తుందని జీప్ పేర్కొంది . 80-డిగ్రీల బ్యాక్ డోర్ ఓపెనింగ్ అండ్ ఫోల్డ్-ఫ్లాట్ రెండవ అండ్ మూడవ వరుసలను కూడా అందిస్తుంది.