ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా ఈ ఏడాది మార్చిలో హోల్‌సేల్స్ తగ్గాయని మారుతీ సుజుకీ, హ్యుండాయ్ ప్రకటించాయి. అయితే టాటా మోటార్స్, స్కోడా, కియా, టయోటా, మహీంద్రా అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఈసారి అమ్మకాలు గత ఐదేళ్లలో అత్యధికమని టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది.
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా తయారీపై ప్రభావం చూపడంతో మార్చి నెలలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్ మోటార్ సేల్స్ తగ్గాయి. కానీ టాటా మోటార్స్, స్కోడా, కియా వెహికిల్ సేల్స్ మాత్రం పెరిగాయి. టయోటా కిర్లోస్కర్, కూడా గత అయిదేళ్లలోనే అధిక వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. టాటా మోటార్స్ వెహికిల్ సేల్స్ మార్చి నెలతో పాటు FY22 నాలుగో త్రైమాసికంలో కూడా భారీగానే పెరిగాయి. సెమీ కండక్టర్ల కొరత ఉన్నప్పటికీ టాటా మోటార్స్ విక్రయాలు పెరిగాయి. డొమెస్టిక్ మార్కెట్‌లో ఈ కంపెనీ సేల్స్ గత మార్చిలో ముప్పై శాతం పెరిగి 86,718 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో 2021 మార్చి నెలలో 66,462 యూనిట్లు నమోదయ్యాయి. నాలుగో త్రైమాసికంలో మాత్రం 28 శాతం వృద్ధి కనిపించింది.
టాటా మోటార్స్, స్కోడా, కియా, టయోటా, మహీంద్రా అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఈసారి అమ్మకాలు గత ఐదేళ్లలో అత్యధికమని టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. తమ కార్ల అమ్మకాలు చాలా బాగున్నాయని మహీంద్రా తెలిపింది. మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు గత మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో 1,55,417 యూనిట్ల నుంచి 7 శాతం తగ్గి 1,43,899 యూనిట్లకు చేరుకున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 16,52,653 యూనిట్లను అమ్మింది. ఎలక్ట్రానిక్ భాగాల కొరతను తీర్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని తెలిపింది. హ్యుండాయ్ మోటార్ ఇండియా తన మొత్తం అమ్మకాలు గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో 14 శాతం తగ్గి 55,287 యూనిట్లకు పడిపోయాయి.
నాలుగో త్రైమాసికంలో 2,33,078 సేల్స్ నమోదు కాగా, 2021 నాలుగో త్రైమాసికంలో 1,82,477 సేల్స్ నమోదయ్యాయి. ఇక FY21లో టాటా మోటార్స్ 4,64,062 వాహనాలు విక్రయించగా, FY22లో ఇది 6,92,554 యూనిట్లకు పెరిగింది. ఇది 49 శాతం వృద్ధి. పాసింజర్ వెహికిల్స సేల్స్ 67 శాతం ఎగిసి 3,70,372 యూనిట్లుగా నమోదయింది.ఆయా కంపెనీల విషయానికి వస్తే మారుతీ సుజుకీ 7 శాతం, హ్యుండాయ్ 14 శాతం, హోండా కార్ప్ 7 శాతం, నిస్సాన్ ఇండియా 25 శాతం, ఎంజీ మోటార్స్ 14.5 శాతం క్షీణించాయి.టాటా మోటార్స్ 30 శాతం, టయోటా కిర్లోస్కర్ 14 శాతం, అశోక్ లేలాండ్ 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 35 శాతం, కియా 18 శాతం, స్కోడా 483 శాతం పెరిగాయి.ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే సుజుకీ మోటార్స్ 6.34 శాతం తగ్గగా, టీవీఎస్ 5 శాతం తగ్గింది.