yamaha bike:యమహా ఎం‌టి వేర్షన్ 2 బుకింగ్స్ ఓపెన్.. అప్ డేట్ ఫీచర్లతో పవర్ ఫుల్ బైక్‌ వచ్చేస్తుంది..

By asianet news telugu  |  First Published Apr 4, 2022, 10:49 AM IST

 గతంలో విక్రయించిన MT15 V1 చాలా కాలం క్రితం నిలిపివేయబడింది. తద్వారా ఈ బైక్  కొత్త అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉన్న అప్ కమింగ్ న్యూ జనరేషన్ మోడల్‌ కానుంది. 


భారతదేశంలో  యమాహా  ఎం‌టి 15(Yamaha MT 15)V2.0 బైక్ లాంచ్ కి సిద్దమైంది. సెలెక్ట్ చేసిన డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైక్ కోసం రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు టోకెన్ మొత్తానికి బుకింగ్‌లు ప్రారంభించాయి. గతంలో విక్రయించిన MT15 V1 చాలా కాలం క్రితం నిలిపివేయబడింది. తద్వారా ఈ బైక్  కొత్త అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉన్న అప్ కమింగ్ న్యూ జనరేషన్ మోడల్‌ కానుంది. లాంచ్ వివరాలు ఇప్పటికీ అధికారికంగా వెల్లడించనప్పటికీ ఈ కొత్త బైక్ ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. 

కొత్త కలర్ అండ్ సస్పెన్షన్
బైక్ అప్‌డేట్‌ల విషయానికొస్తే, బైక్ లేటెస్ట్ లుక్ అందించడానికి కొత్త పెయింట్ స్కీమ్‌తో స్పోర్ట్ చేయవచ్చు. అంతేకాకుండా, యమహా బైక్ సస్పెన్షన్ కిట్‌ను కూడా అప్‌డేట్ చేయవచ్చు. ఈ బైక్‌లో ఇంతకు ముందు ఉన్న టెలిస్కోపిక్ ఫోర్క్‌లను గోల్డెన్ ఫోర్క్‌లతో భర్తీ చేయవచ్చు, అయితే వెనుక సస్పెన్షన్‌ను మార్చకపోవచ్చు. 

Latest Videos

undefined

అప్ డేట్ సస్పెన్షన్ కిట్‌తో పాటు, YZF-R15 V4 ఫెయిరీ బైక్‌లో ఉన్నట్లుగా బైక్ క్విక్-షిఫ్టర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్‌ని కూడా పొందవచ్చు . ఇంకా కంపెనీ  ఈ బైక్ లుక్ అండ్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి  ఎక్స్ స్టీరియర్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు చేయవచ్చు. 

ఇంజిన్ అండ్ పవర్
లేటెస్ట్ అప్‌డేట్‌లతో బైక్  పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. పాత మోడల్ లాగానే 155cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజన్ YZF-R15లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ VVA టెక్నాలజీతో వస్తుంది ఇంకా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000rpm వద్ద 18.1 bhp శక్తిని, 7,500rpm వద్ద 14.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త వెర్షన్‌లో కూడా ఇదే విధమైన అవుట్‌పుట్ ఆశించవచ్చు. 

ధర ఎంతంటే
ధర విషయానికొస్తే, అప్‌డేట్ చేయబడిన MT15 V2 అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ధర ఉండవచ్చు, దీని ధర అంతకుముందు రూ. 1.46 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది.

click me!