చెన్నైలోని నిస్సాన్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ SUV ఫేస్‌లిఫ్టెడ్ టెస్ట్ వెర్షన్ కనిపించింది. దానిలో కొన్ని కొత్త అప్‌డేట్‌లు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఊహించిన మొదటి ఐదు మార్పులు ఇవే.
దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం 2020లో, జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ మాగ్నైట్ భారత మార్కెట్లోకి విడుదల చేయబడింది. ప్రస్తుతం, ఇండియాలో జపనీస్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక కార్ కూడా ఇదే. తాజాగా చెన్నైలోని నిస్సాన్ ఫ్యాక్టరీ సమీపంలో SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అని నమ్ముతున్న టెస్ట్ వెర్షన్ కనిపించింది. అందులో కొన్ని అప్‌డేట్‌లు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఊహించిన మొదటి మార్పులు ఏంటంటే...
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత వెర్షన్‌లో లేని ఎన్నో కొత్త ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లలో సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు స్టాండర్డ్‌గా ఉండే అవకాశం ఉంది.
undefined
ఎక్కువ-మైలేజ్
1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 20 kmpl మైలేజీని అందిస్తుంది, అయితే టర్బోచార్జ్డ్ యూనిట్ 17.4 kmpl ఇస్తుంది. అయితే 2024 నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కూడా దీని ఎక్కువ మైలేజీని పొందే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌లు
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించడంతో సేఫ్టీ పెంచుతున్నట్లు నివేదించబడింది. ఈ SUV ప్రస్తుత వెర్షన్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ వంటి మల్టి సేఫ్టీ ఫీచర్లతో లోడ్ చేయబడింది.
ఈ SUV ఫ్రంట్ లేదా బ్యాక్ ప్రొఫైల్ గురించి సమాచారం లేదు, ఇంకా కొత్త అల్లాయ్ వీల్స్ టెస్ట్ వెర్షన్‌తో అస్పష్టం ఉంది. అయితే లీక్ ఫోటోస్ లో ఈ SUV కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌పై కనిపించింది.
ఎక్కువ పవర్
నిస్సాన్ మాగ్నైట్ పోటీ కార్లకు సరిపోయేలా ఎక్కువ పవర్, టార్క్‌తో 1.0L న్యాచురల్ అండ్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌లను రీ-ట్యూన్ చేస్తుందని భావిస్తున్నారు.