Govt to Penalise EV Companies: ఇటీవల కాలంలో పలు ఎలక్ట్రిక్ టూ వీలర్లు విద్యుత్ షాక్‌కు గురై ఆహుతైన సంఘటనలను మనం చూస్తున్నాం. ఆయా ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రమాదాలపై దృష్టి సారించారు. ప్రమాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఆయా వాహనాల కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మండిపోతున్న పెట్రో ధరలతో క్రమంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, దేశవ్యాప్తంగా ఈ మధ్యే పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.. ఇంట్లో చార్జింగ్ పెట్టిన సమయంలోనే కొన్ని, రోడ్లపై మరికొన్ని ప్రమాదాలు గురయ్యాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఆయా వాహనాల కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు గడ్కరీ. లోపాలున్న వాహనాలను తక్షణమే రీకాల్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇప్పటిదాకా చోటుచేసుకున్న ప్రమాదాలపై విచారణ జరిపి ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు తగలబడిపోయిన ఘటనలు మనం ఎన్నోసార్లు చూశాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిపై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తామని.. అవకతవకలు జరిగినట్లు తెలిస్తే భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ‘ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో గత రెండు నెలల్లో జరిగిన ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది గాయాల పాలవడం దురదృష్టకరం. ఈ ఘటనలపై నిపుణులతో ఒక కమిటీని నియమించాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన సిఫారసులను ఆ కమిటీ అందిస్తుంది.’ అని గడ్కరీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
undefined
ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత విషయంలో కొత్త నియమాలు రూపొందిస్తామని, అలాగే లోపాలున్న వాహనాలను ఆయా కంపెనీలు వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏయే కంపెనీల వాహనాల్లో అయితే సమస్యలు తలెత్తాయో.. ఆయా కంపెనీలకు నోటీసులు పంపించామని తెలిపారు. ఏ కంపెనీ అయినా వాహనాల తయారీలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలిస్తే వారికి జరిమానా విధించడంతో పాటు లోపాలున్న వాహనాలన్నీ వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో కంపెనీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ద్విచక్ర వాహనం నడిపేవారి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు.
అయితే ఈ నెల ప్రారంభంలో ఓలా ఈ-స్కూటర్ మంటల్లో చిక్కుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణను ప్రారంభించింది ప్రభుత్వం స్టార్టప్ ప్యూర్ ఈవీకి చెందిన స్కూటర్ కూడా మంటల్లో చిక్కుకుంది. ఇక ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ బైక్ దగ్ధమై ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. కాగా.. నివేదికల ఆధారంగా మేం డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేస్తాం. మేం త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు గడ్కరీ. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించబడుతుంది. అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయడానికి కూడా ఆదేశిస్తామని స్పష్టం చేశారు.