ట్రంప్ విదేశీ కార్లపై 25% టారిఫ్ వేయాలని డిసైడ్ చేశారు. దీనివల్ల వ్యాపార భాగస్వాములతో గొడవలు పెరిగి, వ్యాపారస్తులకు కష్టాలు వస్తాయి.
విదేశీ కార్లపై టారిఫ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి జనాలకు పెద్ద షాక్ ఇచ్చారు. వేరే దేశాల్లో తయారైన కార్లపై భారీగా టారిఫ్ వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్లపై 25 శాతం టారిఫ్ వేయాలని ట్రంప్ డిసైడ్ చేశారని వైట్ హౌస్ తెలిపింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతర దేశాల్లో తయారైన కార్లపై 25 శాతం టారిఫ్ వేయాలని నిర్ణయం అమెరికాలో తయారైన కార్లపై ఎలాంటి టారిఫ్ ఉండదని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది. ఇదివరకు ఉన్న టారిఫ్‌లతో పాటు, విదేశాల్లో తయారైన కార్లు, లైట్ ట్రక్కులపై కూడా ఇది వర్తిస్తుంది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై కూడా టారిఫ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్ వేశారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై కూడా 25 శాతం టారిఫ్ వేశారు. ఇప్పటికే ఉన్న టారిఫ్‌లు, రూల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులకు ఇది మరింత కష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఉత్పత్తిదారుల ఖర్చు పెరుగుతుందని ఎకానమిస్టులు అంటున్నారు. కంపెనీలు ఈ ఖర్చులను తట్టుకోలేకపోతే, వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి వస్తుంది. అయితే అమెరికా ఎక్కువగా మెక్సికో, జపాన్, జర్మనీ, స్లొవేకియా, దక్షిణకొరియా, చైనా దేశాల నుంచే కార్లు దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి దిగుమతి అయ్యేది నామమాత్రమే. దీంతో మనకొచ్చిన ఇబ్బంది పెద్దగా ఉండదని నిపుణులు అంటున్నారు.