వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్! డిజైన్ రెడీ... ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసా?

By Ashok Kumar  |  First Published Jul 17, 2024, 3:28 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకుకు 'ఎలక్ట్రిక్01' అని పేరు పెట్టవచ్చని చెబుతున్నారు. దింతో  2026 ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ కావచ్చు.
 


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ విడుదలైంది. అయితే, బులెట్ లవర్స్ ఈ మోడల్‌ కోసం ఏడాదిన్నర పాటు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 2026 ప్రారంభంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

350-700 cc సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోడల్‌లో మాత్రం ఇంకా అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు కంపెనీ  మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ సంబంధించిన పేటెంట్ ఫొటో ఒకటి బయటపడింది. దీని డిజైన్ ప్రత్యేకమైన బాబర్-స్టయిల్ రెట్రో డిజైన్‌తో ఉంటుంది.

Latest Videos

undefined

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ గురించి కొన్ని వివరాలను డిజైన్ పేటెంట్ ఇమేజ్ ద్వారా చూడవచ్చు. దీని ముందు భాగంలో ఎక్కువ ప్లేస్ ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాటరీ ప్యాక్, మోటారు కలిపి ఉన్నట్లు కూడా చూడవచ్చు. బ్యాక్  వీల్ బెల్ట్ డ్రైవ్ ద్వారా నడుస్తుంది.

ఫోటోలో మాత్రం ఒక సీటు మాత్రమే చూపించింది. అయితే, వెనక శారీ గార్డ్ ఉండడంతో వెనుక కూడా ఇంకో సీటు ఉంటుందని చెప్పవచ్చు.

డిజైన్ పేటెంట్ ఫొటోలో చాలా ఆసక్తికరమైన వివరాలు కూడా కనిపిస్తున్నాయి. డిజైన్ పేటెంట్ ఫొటో 100 సంవత్సరాల క్రితం బైకులో ఉపయోగించిన గిర్డర్ ఫోర్క్‌ను ఉపయోగించినట్లు  బైక్‌ కనిపిస్తుంది. కానీ, ఇందులో కొంత లేటెస్ట్ అంశం ఉంటుందనడంలో డౌట్ లేదు.

వెనుక భాగంలో అల్యూమినియం స్వింగార్మ్ ఉండే అవకాశం ఉంది. మోనోషాక్‌ని చక్కగా కనిపించకుండా సెట్ చేశారు. బైక్ టైర్లు సన్నగా కనిపిస్తున్నాయి. దీని ద్వారా రోలింగ్ కెపాసిటీ, స్పీడ్ పెంచుతుందని ఆశించవచ్చు.

అయితే వివరాలు ఇప్పుడేమీ కచ్చితంగా చెప్పలేం. ఈ బైక్ ఫీచర్లు ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. ఈ బైకుకు  'ఎలక్ట్రిక్01' అని పేరు పెట్టవచ్చని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, ఈ బైక్  ఒక సంవత్సరం లేదా ఏడాదిన్నరలో ప్రొడక్షన్ కి వెళ్లి 2026 ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చు.

click me!