బీఎస్-6 సరే: మరి బీఎస్-4 వెహికల్స్ సంగతేంటి..?

By Sandra Ashok KumarFirst Published Feb 12, 2020, 3:54 PM IST
Highlights

బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల ఉత్పత్తి, విక్రయం, వాడకానికి సుప్రీంకోర్టు, కేంద్రం ప్రభుత్వం విధించిన గడువు దగ్గర పడుతోంది. ఆటోమొబైల్ సంస్థలు ఆ దిశగా వడివడిగా అడుగులేస్తున్నాయి. అదే సమయంలో బీఎస్-4 వాహనాల భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

న్యూఢిల్లీ: వాహన కాలుష్యం నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ ప్రమాణాలు -6 (బీఎస్-6) వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీనుంచే అమలు కానున్నాయి. ఈ నిబంధనలకనుగుణంగా లేని వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉండదు. 

దీంతో ఆటోమొబైల్ కంపెనీలు బీఎస్-6 నిబంధనల్ని పాటిస్తూ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఈ కొత్త వెహికల్స్‌తో ఆటోమొబైల్ రంగంతోపాటు వినియోగదారులపై ఎంత భారం పడుతుంది? అంతకు ముందు బీఎస్-4 వెహికల్స్ పరిస్థితి ఏంటి? ఆటోమొబైల్ పరిశ్రమ మార్కెట్ పరిస్థితి పరిశీలిద్దాం.

also read బీఎస్-6 ధరలు పెరగడంతో... తగ్గిన వాహనాల అమ్మకాలు..

రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తయారు చేసే వెహికల్స్‌లో బీఎస్-6 టెక్నాలజీతో కూడిన ఇంజన్ మాత్రమే అమర్చాలనే నిబంధనను తీసుకొచ్చింది. బీఎస్-6 వాహనాల్ని రూపొందించాలంటే 20% వరకు బడ్జెట్ పెరుగుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు అంటున్నారు. 

కొత్త రూల్‌తో బండిని తయారు చేయాలంటే.. ప్యాసెంజర్ వెహికిల్స్ కి 12 నుంచి 15 శాతం, కమర్షియల్ కి 15 నుంచి 20 శాతం ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు. డీజెల్ వెహికిల్స్ పై లక్ష నుంచి లక్షన్నర రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో మారుతి డిజీల్ వర్షన్ వెహికల్స్ తయారీని నిలిపివేసింది.


 
ఇప్పటికే వాహనాల రేట్లు పదే పదే పెరుగుతుండటం, వడ్డీ రేట్లు ఎక్కువ అవుతుండటంతో సేల్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు బీఎస్-6 నిబంధనలతో పెరిగిన మొత్తాన్ని కస్టమర్లపై వేయడంతో అమ్మకాలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు. 

అన్ని కేటగిరీల్లో వాహనాల రిటైల్ సేల్స్ దాదాపు 16% క్షీణించాయి. బీఎస్-6 నిబంధనలతో పెట్రోల్ వెహికిల్స్ తెచ్చేందుకు గతేడాదే మహింద్రా అండ్ మహింద్రా వేయి కోట్లకు పైనే పెట్టుబడి పెట్టింది. మారుతి సుజుకీ బాలెనోతో పాటు స్విఫ్ట్, వ్యాగనార్ మోడళ్లలో బీఎస్-6 వేరియంట్ కార్లను ఆవిష్కరించింది.

also read ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతున్నా కరోనా వైరస్.....

మోడల్ బట్టి ఒక్కో వెహికల్ పై రూ. 10 నుంచి 16 వేల వరకు పెరుగుతున్నాయి.  టూవీలర్ల కంపెనీ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ బీఎస్-6 ప్రమాణాలతో కూడిని యాక్టివా 125 స్కూటీని లాంచ్ చేసింది. బీఎస్-4 వర్షన్ తో పోలిస్తే బీఎస్-6 ధర 10 నుంచి 15 శాతం అధికంగా ఉందని కంపెనీ ప్రకటించింది.

కమర్షియల్ వెహికిల్స్ లో ఐషర్ ట్రక్ అండ్ బసెస్ కంపెనీ.. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఐషర్-ప్రో 2000 లైట్ కమర్షియల్ ట్రక్కులను మార్కెట్లోకి తెచ్చింది. ఇక బీఎస్-6 ఇంజన్‌తో వచ్చే డీజిల్ బండ్లపై రేట్లు పెరుగుతుండటంతో వెహికిల్స్ కొనేవారు ముందే కొనేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నామంటున్న కేంద్ర ప్రభుత్వం.. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. వివిధ కంపెనీలు ఈ-వెహికల్స్‌ని ఆవిష్కరిస్తున్నా, అన్ని ప్రాంతాలలో ఛార్జింగ్ పాయింట్స్ లేకపోవడానికి తోడు ఈ-వెహికిల్స్ పై ప్రభుత్వ సబ్సిడి లాంటి వాటిపై క్లారిటీ లేకపోవడంతో పెద్దగా విజయవంతం కావడం లేదంటున్నారు.
 

click me!