కారు కొనాలనే వారికి ఇదే కరెక్ట్ టైం...బ్రాండెడ్ కార్లపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు

By Sandra Ashok Kumar  |  First Published Dec 14, 2019, 11:50 AM IST

పలు ఆటోమొబైల్​ సంస్థలు కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్​ ప్రకటించాయి. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంటుండటంతో పాత స్టాక్​ను భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నాయి.  దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.


న్యూఢిల్లీ: కారు కొనాలనే ఆలోచనలో ఉన్న వారికి ఇదే సరైన సమయం. మరో రెండు వారాల్లో 2019 ముగుస్తున్న నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.

ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలో వీలైనన్ని ఎక్కువ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కార్ల తయారీ సంస్థలు. ముఖ్యంగా ఇప్పటి వరకు మిగిలిపోయిన స్టాక్​ వీలైనంతవరకు తగ్గించుకోవాలని ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇందుకోసం భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయిస్తున్నాయి.

Latest Videos

undefined

also read 2.74 సెకన్లలో 100 కి.మీ స్పీడ్: సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ స్పెషాలిటీ

పాత స్టాక్​ను తగ్గించుకోవడం సహా కార్లపై డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2020 ఏప్రిల్ నుంచి వాహనాలకు భారత్​​ స్టేజ్​ (బీఎస్​)-6 ఉద్గార నియమాలు తప్పనిసరి కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీఎస్​-4 వాహనాలను వీలైనంత ఎక్కువగా, త్వరగా విక్రయించాలని భావిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. వీటికితోడు ఈ ఏడాది భారీగా తగ్గిన వాహన విక్రయాలను డిస్కౌంట్లతోనైనా పెంచుకోవాలనేది ఆయా సంస్థల ప్యూహంగా తెలుస్తోంది.

దేశీయంగా ప్రధాన కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సహా హ్యుండాయ్​, హోండా, వోక్స్ వ్యాగన్, టాటా మోటార్స్​ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్న జాబితాలో ఉన్నాయి.మారుతీ సుజుకీ సంస్థ తన ఆల్టో 800 కారుపై రూ.60,000, బాలెనోపై రూ.45,000, ఎస్​-క్రాస్ పైరూ.1.13 లక్షలు, సియాజ్​ మోడల్ కారుపై రూ.75 వేలు, ఇగ్నిస్​ కారుపై రూ.65వేల డిస్కౌంట్ అందిస్తోంది. 

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్​ తన శాంట్రో మోడల్ కారుపై రూ.55 వేలు, వెర్నా కారుపై రూ. 60 వేలు, ప్రజాదరణ పొందిన క్రెటా కారుపై రూ.95,000. ఎలాంట్రా మోడల్ కారుపై రూ.2 లక్షల మేరకు రాయితీ కల్పిస్తోంది. ఇంకా గ్రాండ్ ఐ10నియోస్ కారుపై రూ.20,000 డిస్కౌంట్ అందిస్తోంది. 

also read 5.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం...ధర ఎంతంటే ?

వోక్స్​ వ్యాగన్​ సంస్థ తన పోలోమోడల్ కారుపై రూ.1.5 లక్షల ఆఫర్ ప్రకటించింది. దీంతో పాటు కార్పొరేట్ ఆఫర్​ కింద రూ.25,000, డిస్కౌంట్​ బోనస్​గా రూ.10,000 వరకు అందించనున్నట్లు వోక్స్ వ్యాగన్ వెల్లడించింది.హోండా కార్స్ సంస్థ తన అమేజ్​ మోడల్ కారుపై రూ.42,000, జాజ్ కారుపై రూ.50 వేలు, డబ్ల్యూఆర్​-వీ మోడల్ కారుపై రూ.45,000, సిటీ సెడాన్ కారుపై రూ.62,000, సివిక్ మోడల్ కారుపై అధికంగా రూ.2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. 

ఇక దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన టియాగో మోడల్ కారుపై రూ.75,000, హెక్సా​ మోడల్ కారుపై రూ.1.65 లక్షలు, నెక్సాన్​    మోడల్ కారుపై రూ.1.07 లక్షలతోపాటు ఎస్​యూవీ హారియర్​ కారుపై రూ.65 వేల డిస్కౌంట్ అందజేస్తోంది.

click me!