యువతే లక్ష్యం:13న విపణిలోకి హీరో మాస్ట్రో ఎడ్జ్ అండ్ ప్లీజర్

By rajesh yFirst Published May 11, 2019, 10:59 AM IST
Highlights

వాహనాల విపణిలోకి హీరో మోటో కార్ప్ తాజాగా యువతరం కోసం డిజైన్ చైసిన ‘మాస్ట్రో 125’, ‘ప్లీజర్ 110’ మోడల్ స్కూటర్లను ఈ నెల 13న విడుదల చేయనున్నది. వాటి ధరలు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. 
 

న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహనాల దిగ్గజం ‘హీరో మోటో కార్ప్స్’ విపణిలోకి మరో రెండు మోడల్ స్కూటర్లను ఆవిష్కరించనున్నది. ఈ నెల 13వ తేదీన మాస్ట్రో ఎడ్జ్ 125, ప్లీజర్ 110 మోడల్ స్కూటర్లు రోడ్లపైకి రానున్నాయి. ఇప్పటికే హీరో ఎక్స్‌పల్స్ 200, హీరో ఎక్స్‌పల్స్ 200 టీ, హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోడల్ ప్రీమియం బైక్‌లను ఈ నెల ఒకటో తేదీన హీరో మోటో కార్ప్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 

హీరో మోటో కార్ప్స్ నుంచి 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో వెలువడుతున్న స్కూటర్ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్. దీంతోపాటు అదర్ ఆప్షన్‌గా హీరో డెస్టినీ 125 ఉంది. స్పోర్టీ డిజైన్‌తో రూపుదిద్దుకున్న హీరో మాస్ట్రో 125 స్కూటర్ పూర్తిగా యువతరం కోసమేనని కంపెనీ ప్రకటించింది. 

హీరో డెస్టినీ 125లో వాడిన ఇంజిన్‌నే న్యూ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ లోనూ వాడతారు. 125 సీసీ ఎనర్జీ బూస్ట్ మేకర్ 6750 ఆర్పీఎం వద్ద 8.7 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్చ్ అందిస్తుంది. 

న్యూ హీరో మాస్ట్రో స్కూటర్ కంపెనీ ఐ3ఎస్ (ఐడిల్-స్టాప్-స్టార్-సిస్టమ్) టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది. ఇది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, బాత్ డ్రమ్ అండ్ డిస్క్ వారియంట్లు కలిగి ఉంటుంది. 

డైమండ్ కట్ కాస్ట్ వీల్స్, సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, ఫ్రొస్ట్ వింకర్స్, షార్ప్ ఫ్రంట్ కవర్, అప్రోన్, స్లీక్ రేర్ కౌల్ తదితర ఫీచర్లు జత కలిపారు. ఇంకా ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్, రిమోట్ కీ ఓపెనింగ్, మొబైల్ చార్జింగ్ పోర్ట్, బూట్ లాంప్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా మ్యాట్ టెక్నో బ్లూ, మ్యాట్ రెడ్, మ్యాట్ బ్రౌన్, మ్యాట్ వెర్నియర్ గ్రే కలర్స్‌లో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 లభిస్తుంది. 

ఇక హీరో న్యూ ప్లీజర్ స్కూటర్ రీ ఫర్బిష్డ్ హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్స్, 102 సీసీ మోటార్ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 6.9 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 8.1 ఎన్ఎం టార్చ్ ఆవిష్కరిస్తుంది. హీరో డ్యూట్, హీరో మాస్ట్రో ఎడ్జ్‌ల్లో వాడే ఇంజిన్లనే హీరో ప్లీజర్ స్కూటర్ లోనూ వాడతారు. రెండు మోడల్ స్కూటర్ల ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

click me!