ధనుర్మాసంలో మీ రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Dec 19, 2018, 3:26 PM IST
Highlights

ఈ ధనుర్మాసంలో మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

రవి శరీరంలో రక్త ప్రసరణకు కారకుడు. ఆత్మకు కారకుడు. గుండెకు కారకత్వం వహిస్తాడు. అలాగే శరీర అవయవాల్లో రవి అనుకూలంగా లేకపోతే ఏ వ్యవస్థ సరిగా పనిచేయదు. హృదయానికి కారకుడు. జ్యోతిష శాస్త్ర రీత్యా పితృకారకుడు. హోదాలకు అధికారాలకు కారకుడు. ఆరోగ్య కరాకుడు. సహజంగా పాప గ్రహం కావడం వల్ల రవి, థ అంతర్దశలలో చికాకులు కూడా ఉంటాయి. రవి ధనుస్సు సంక్రమణం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ మాసం మొత్తం కొంత ఒత్తిడి చికాకులు తప్పవు.

మేషం : సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం వల్ల ఒత్తిడికి గురి అవుతారు. విద్యార్థులకు ఉన్నత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధకులు ఎక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు. అనుకున్నంత సంతృప్తి కలుగదు. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు అనుకున్నంతగా సఫలీకృతం కావు. చేసే అన్ని పనుల్లోను మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చికాకులు పడకూడదు.

వృషభం : అనుకోని కష్టాలు వస్తాయి. ఊహించని ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు అన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. పరాశ్రయం ఉంటుంది. ఆహారం విషయంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సూచనలు ఉన్నాయి. తొందరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వాహనాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు అధిక శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఆశించిన ఫలితాలు రావు. తొందరపడకూడదు.

మిథునం : ఉద్యోగరీత్యా దగ్గరి ప్రయాణాలు చేయడం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. ప్రయాణాల్లో సంతోషం ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. నూతన పరిచయస్తులతో కొంత తెలివిగా ప్రవర్తించాలి. వారితో ఇబ్బంది వచ్చే సూచనలు. పదిమందిలో గౌరవంకోసం ఆరాట పడతారు. గౌరవహాని కలుగవచ్చు. ఎక్కువగా ఆరాటపడకూడదు. విద్యార్థులు కొంత శ్రమతో ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. అందరిలో గుర్తింపు ఉండదు. తెలివితేటలు పెరుగుతాయి.

కర్కాటకం : వీరు పోటీల్లో గెలుపు ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పరాక్రమం పెరుగుతుంది. కాని శత్రువులుకూడా పెరుగుతారు. గెలుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ శత్రువులు కూడా ఉంటారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు పెరుగుతుంది. మాటల్లో జాగ్రత్త అవసరం. అనవసర తొందరపాటు పనికిరాదు. మధ్యవర్తిత్వాలజోలికి వెళ్ళకూడదు. కుటుంబంలో చికాకులు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి.

సింహం : తాను చేసే పనులు కొంత ఆలోచనలో చేయాలి. సృజనాత్మకతను పెంచుకోవాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. అనుకోని ఇబ్బందులు, ఆలస్యాలు జరిగే సూచనలు ఉంటాయి. జాగ్రత్త అవసరం. సంతాన సమస్యలు కొంత అసౌకర్యానికి గురి చేస్తాయి. పరిపాలన సమర్థత కలిగి ఉంటారు. ఏ పనినైనా అప్పగిస్తే కష్టపడి పనిని పూర్తిచేస్తారు. తాను కష్టపడిన దానికి తగిన గుర్తింపు రాలేదని బాధపడతారు. జాగ్రత్తగా ఉండాలి.

కన్య : వీరికి సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలు కావాలనుకుంటే అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. విశ్రాంతి లోపం కూడా ఉంటుంది. తల్లితో తరఫు బంధువులతో జాగ్రత్త అవసరం. లేనిపోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. విద్యార్థులకు కొంత, శ్రమ ఒత్తిడి అనంతరం తాము పడిన శ్రమకు తగిన ఫలితాలు రావు. కాని కొంత తక్కువలో వస్తాయి. తెలుసుకొని మసలుకోవడం మంచిది.

తుల : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు ఉద్యోగాలకోసం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అన్ని రకాల ఆదాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి కనబడుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం సాధిస్తారు. అందులో విజయం సాధిస్తారు. కొంత శ్రమ ఉన్నా సంతృప్తి లభిస్తుంది.

వృశ్చికం : తాము చేసే పనుల్లో ఒత్తిడి ఉంటుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల జోలికి వెళ్ళకూడదు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. కుటుంబంలో చికాకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మనస్ఫర్థలు వచ్చే సూచనలు జాగ్రత్త అవసరం. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు. అనవసర ఖర్చులు ఉంటాయి. చేసే వృత్తుల్లో ఒత్తిడి ఉంటుంది. తోటి ఉద్యోగులతో సౌమ్యంగా మెలగాలి. సంఘంలో గౌరవంకోసం ఆరాటం ఉంటుంది.

ధనస్సు : దూర ప్రయాణాలకై ఆసక్తి ఉంటుంది. కొంత మానసిక చికాకు ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. చేసే పనిలో మంచి చెడు విచారణ చేసి పనిని ప్రారంభిస్తారు. గౌరవం పెరుగుతుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుటాంరు. ఆశయ సాధన ఉంటుంది.

మకరం : ఊహించని ఖర్చులు చేస్తారు. సమయం వృథా అవుతుంది. తమకు తెలియకుండా, తమ ప్రమేయం లేకుండా ఒత్తిడిని అనుభవిస్తారు. విశ్రాంతికై ప్రయత్నం ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. భ్రమల నుంచి బయట పడాలి. వాస్తవంలో బ్రతకాలి.

కుంభం : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు కూడా లభిస్తుంది. సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. పదోన్నతి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆశయ సాధన ఉంటుంది. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. పెట్టుబడులు విస్తరిస్తాయి. సహకారం లభిస్తుంది. పరాక్రమం పెరుగుతుంది.

మీనం :  అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి కనబడుతుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. పెద్ద పెద్ద కంపెనీలలో మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎన్ని పనులు చేసిన ఒత్తిడి మాత్రం తగ్గదు. శ్రమ పడితేనే గుర్తింపు ఉంటుంది. సంతృప్తి కూడా లభిస్తుంది.

అన్ని రాశుల వారు వారివారి చికాకులను తగ్గించుకోడానికి సూర్యాష్టకం పారాయణం, ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం చేయాలి. మొత్తం పారాయణ చేయలేనివారు కనీసం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనే శ్లోకాన్ని ఐనా తప్పనిసరిగా పారాయణ చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!