19డిసెంబర్2018 బుధవారం రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Dec 19, 2018, 9:39 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు వచ్చే సూచనలు. గౌరవంకోసం ఆరాట పడతారు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ, లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచన. శతృవులపై విజయానికి తాపత్రయం. పోీల్లో గెలుపుకై ఆలోచిస్తారు. అనుకోని సమస్యలు ఉంటాయి. ఋణ ఆలోచనలు పెరిగే సూచన.  రోగనిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు జాగ్రత్తలు. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఆత్మీయత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాల వల్ల సంతోషం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గృహ సౌకర్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. మాతృసౌఖ్యం లభిస్తుంది. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : స్త్రీజన సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాల్లో సంతృప్తి ఉంటుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. రచనలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం.  కమ్యూనికేషన్స్‌ ఫలిస్తాయి. ప్రచార సాధనాల్లో సంతృప్తి ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత  ఉంటుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం. స్త్రీలు ఆభరణాలపై దృష్టి పెడతారు. వాగ్దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వాలు ఫలిస్తాయి. కిం సంబంధ లోపాలు తగ్గుతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. ఆశయాలకు అనుగుణమైన ప్రవర్తన ఉంటుంది.  పనులలో ప్రణాళికలు వేసుకుటాంరు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ఖర్చులు పెట్టే సూచనలు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పనులలో సంతోషం. పాదాల నొప్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.  సుఖంకోసం ఆరాట పడతారు. సుఖం లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలపై దృష్టి ఉంటుంది. సమిష్టి ఆశయ సాధన. దురాశ ఉంటుంది. స్త్రీల ద్వారా ఆదాయ సంపాదన. కంపెనీలలో వాలలకే ప్రయత్నం.   కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉద్యోగస్తులతో అనుకూలత ఉండదు. ఉద్యోగంలో ఒత్తిడులు వచ్చే సూచన. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న సమయం. అనుకోని సమస్యలు ఉంటాయి. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. విహార యాత్రల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. పరిశోధనలపై ఆసక్తి వల్ల కష్టాలు వచ్చే సూచన. దూరదృష్టి పెరుగుతుంది. శాస్త్రపరిజ్ఞానం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమ లేకుండా వచ్చే ఆదాయంపై దృష్టి ఉంటుంది. కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది.  క్రయవిక్రయాలు అభివృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. వైద్యశాలల సందర్శనం. పరామర్శలపై దృష్టి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడ మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!