శ్రీ శోభకృత్ నామ సంవత్సర: మీన రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

By telugu news team  |  First Published Mar 21, 2023, 4:50 PM IST

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం మీన రాశివారికి ఈ ఏడాది  కుటుంబ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు కనపడతాయి. ఉద్యోగం నందు అధికార వృద్ధి. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొంటారు


కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Latest Videos

undefined

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

  మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
ఆదాయం:-8
వ్యయం:-11
రాజపూజ్యం:-1
అవమానం:-2

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి జన్మరాశిలో సంచరించి ఏప్రిల్ 21 నుండి ద్వితీయ స్థానం నందు సంచరించును.

శని:-ఈ సంవత్సరం అంతా వ్యయస్థానమునందు సంచరించును.( ఏలినాటి శని)

రాహు:-సంవత్సర ప్రారంభం నుండి ద్వితీయ స్థానం నందు సంచరించి అక్టోబర్ 31 జన్మ రాశిలో సంచరించును

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి అష్టమ స్థానము నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి సప్తమ స్థానము నందు సంచరించును.

బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రత్యర్థులు మూలకంగా పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.   కుటుంబం నందు సంఘము నందు ప్రతికూలత వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఇతరులతో టి వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమునందు  అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగును . మే నెలనుండి వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శారీరకంగా మానసికంగా బలపడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది . తలపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు. కుటుంబ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు కనపడతాయి. ఉద్యోగం నందు అధికార వృద్ధి. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొంటారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు .  ఏలినాటి శని  ప్రభావంతో   కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి . ఆరోగ్యపరంగా  తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగండి . పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారు శనికి రాహు కేతువులకు జపదానములు చేయడం మంచిది. శనివారములు నియమాలు పాటించాలి


 ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 
  

ఏప్రిల్
అవసరానికి సరిపడా ఆదాయం లభించును. చేయ పని యందు శారీరక శ్రమ పెరిగి శారీరక మానసిక అలసటలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకార తోటి కొన్ని సమస్యలు తీరగలవు. కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించాలి లేదా  అవమానములు కలగవచ్చు.

మే
వృత్తి వ్యాపారమునందు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యుల తోటి ఆప్యాయత అనురాగాలు పొందగలరు. చేయి వ్యవహారంయందు పెద్దల యొక్క సలహాలు సహకారాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.సమస్యలు ను ధైర్యంగా ఎదుర్కొంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

జూన్
వృత్తి వ్యాపారాలు అనుకూలించను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా సాగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులకు ఉత్సాహకరంగానుండను. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండవలెను. చిన్నపాటి సమస్యలు ఏర్పడగలవు.

జూలై
గృహం నందు శుభ కార్యాచరణ. ఆర్థికంగా బలపడతారు. చేయు వ్యవహారం నందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. కొన్ని సంఘటనలు భయాందోళన కలిగించిను. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు అనుకూలంగా ఉండను.

ఆగష్టు
బందోవర్గముతోటి విమర్శులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారంలో సాధారణంగా ఉంటాయి. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు రాగలవు. మానసిక ఒత్తిడి ఉద్రేకతలు పెరుగును. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడగలవు. ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు వలన పనులు మధ్యలో నిలిచిపోను.

సెప్టెంబర్
మిత్రులందరికీ అపకారం జరగవచ్చు. మానసిక అశాంతి పెరుగుతుంది. చేయ పని యందు ఆతురత పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. బంధుమూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయం నందు ఆందోళనకు గురి ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరం.

అక్టోబర్
పనుల యందు ఆటంకాలు శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజం నందు గౌరవ మర్యాదలు తగ్గును. ఇంటా బయట సామరస్యంగా ఉండవలెను. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. ఉద్యోగమునందు స్థాన చలనం. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలరు.

నవంబర్
ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది. సమాజము నందు అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడి నిలిచిపోను. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి అభిప్రాయ బేధాలు కలగవచ్చు. ఆరోగ్య ఇబ్బందులు. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. కుటుంబ సభ్యుల తోటి అకారణ విరోధాలు ఏర్పడగలవు.

డిసెంబర్

జనవరి
ఈ మాసంఅనుకూలమైన వాతావరణం.కుటుంబ అభివృద్ధి కలుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉత్సాహంగా కడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.

ఫిబ్రవరి
ప్రయత్నించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారములు సజావుగా సాగును. ప్రయాణాలు లాభించును. ఇతరుల విషయాల యందు దూరంగా ఉండటం మంచిది. శారీరక మానసిక బలహీనత ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడగలరు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.
మార్చి

ఆరోగ్య సమస్యలు తోటి ఇబ్బందులు కలుగును. మిత్రుల తోటి విరోధం. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు. కష్టానికి తగ్గప్రతిఫలం లభించదు. మనసునందు ఆందోళనగా ఉంటుంది. శత్రు బాధలు ఏర్పడగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. తలపెట్టిన పనుల్లో అపజయాలు ప్రార్థించగలవు. విద్యార్థులు పట్టుదలతోటి చదవవలెను.

click me!