జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు టాక్సిక్ రిలేషన్ ని ఇష్టపడతారు. ఆ రిలేషన్ కి ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
ప్రతి ఒక్కరూ తమ రిలేషన్ చాలా అందంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. టాక్సిక్ రిలేషన్ ని ఎవరూ ఇష్టపడరు. కానీ.... జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు టాక్సిక్ రిలేషన్ ని ఇష్టపడతారు. ఆ రిలేషన్ కి ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
1.వృశ్చిక రాశి
undefined
వృశ్చిక రాశి వ్యక్తులు వారి అభిరుచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రాశివారికి అన్ని విషయాల్లోనూ వీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే విచిత్రం ఏమిటంటే.. ఈ రాశివారు టాక్సిక్ రిలేషన్ పట్ల ఆకర్షితులౌతూ ఉంటారు. రిలేషన్ లో ఉంటే వీరైనా టాక్సిక్ గా ఉంటారు. లేదంటే... తమ భాగస్వామి అయినా అలా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారికి అసూయ చాలా ఎక్కువ. అన్నీ తమకే సొంతం అవ్వాలనే కోరిక కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది.
2.మీన రాశి..
మీనం వారి భావోద్వేగ లోతు, సున్నితత్వానికి ప్రసిద్ధి చెందింది. ఈ రాశివారు చాలా ఎక్కువగా సానుభూతి కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ప్రతి విషయంలోనూ తమ భాగస్వామి పై ఆధారపడుతూ ఉంటారు. తమ భాగస్వామి కోసం అన్ని విషయాలను త్యాగం చేస్తూ ఉంటారు. తమ పార్ట్ నర్ కంట్రోల్ లో ఉండటానికి ఇష్టపడతారు. వీరికి టాక్సిక్ రిలేషన్ ని ఎక్కువగా ఇష్టపడతారు.
3.మిథున రాశి...
మిథున రాశివారికి తెలివికి ప్రసిద్ది చెందారు, ఇది వారిని చాలా ఆకర్షణీయంగా, సరదాగా భాగస్వాములను చేస్తుంది. అయినప్పటికీ, వారు అస్థిరత, మైండ్ గేమ్‌లు ఆడే ధోరణికి కూడా గురవుతారు, ఇది సంబంధాలలో గందరగోళం , నాటకీయతను సృష్టించగలదు.
4.మకర రాశి...
ఈ రాశిచక్రం వారి భావాలను ధృవీకరించగల సహచరుడి కోసం చూస్తుంది. వారు తమ వ్యక్తితో సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. వారు ఎల్లప్పుడూ వారికి స్థిరత్వాన్ని అందించగల వారి కోసం వెతుకుతూ ఉంటారు. వీరు తొందరగా ఎవరినీ నచ్చరు. జీవితంలోకి వచ్చిన వ్యక్తిలో కూడా ఎప్పుడూ ఏదో ఒక తప్పులను వెతుకుతూ ఉంటారు. ఈ రాశివారికి ఒంటరిగా ఉండటం అంటే భయం. ఈ క్రమంలో తమ భాగస్వామిని కంట్రోల్ చేస్తారు.
5.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ ఈ రాశివారికి టాక్సిక్ రిలేషన్ షిప్ అంటే ఎక్కువ ఇష్టం. వీరు అలాంటి రిలేషన్ లకు ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. నిజంగా ప్రేమలో ఉన్నామా లేదా అనే విషయం వీరు తెలుసుకోలేరు. ఈ క్రమంలోనే వీరు తమ భాగస్వామిని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు.
మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారు రిలేషన్ షిప్‌లోకి ప్రవేశించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు.